పశ్చిమబెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అవినీతిపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. నదియా జిల్లాలోని క్రిష్ణనగర్‌లో శనివారం జరిగిన విజయ సంకల్ప సభలో ప్రధాని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన టీఎంసీ అంటే ‘తూ, మైన్ ఔర్ కరప్షన్ (నువ్వు, నేను ఇంకా అవినీతి)’ అని అభివర్ణించారు. బెంగాల్ సీఎం దీదీ ప్రతి పథకాన్ని స్కామ్ గా మార్చిదని ప్రధాని మోదీ మండ్డిపడ్డారు. ఆమె వల్ల బెంగాల్ ప్రతిష్ట దిగజారిదని ఆరోపించారు.
సభకు వచ్చిన మిమ్మల్నందరినీ చూస్తుంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి 400కు పైగా లోక్‌సభ స్థానాలు గెలువడం ఖాయమనిపిస్తోందని భరోసా వ్యక్తం చేశారు. అదేవిధంగా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పశ్చిమబెంగాల్‌లోని మొత్తం 42 సీట్లకు 42 సీట్లు గెలువాలని ప్రధాని మోదీ రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి లక్ష్యం నిర్దేశించారు.
రాష్ట్ర బీజేపీ కలిసికట్టుగా పనిచేసి లోక్‌సభ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని పిలుపునిచ్చారు. అరాచకాలు, వారసత్వ రాజకీయాలు, విద్వంసాలకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పర్యాయపదమని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే సందేశ్‌ఖాలి ఉదంతాన్ని ప్రధాని మోదీ లేవనెత్తారు. రాష్ట్రంలో మహిళలకు అండగా నిలువాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన నిందితులకు వత్తాసు పలుకుతోందని విమర్శించారు.
రాష్ట్రంలోని తల్లులు, చెల్లెల్లు న్యాయం కోసం అభ్యర్థిస్తుంటే ప్రభుత్వం వారి గోడును వినిపించుకోవడం లేదని మండిపడ్డారు. మహిళల సంక్షేమం పేరుతో ఓట్లు గుంజిన టీఎంసీ ఇప్పుడు మహిళలను ఏడిపిస్తోందని ధ్వజమెత్తారు. సీఎం మమతా కాపాడుతోందని ప్రధాని సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. మమత సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందని, నేరస్తులకు టీఎంసీ అడ్డాగా మారిందని ఆరోపించారు.
తాము పేదలకు ఇచ్చే ప్రతిదానిని లాక్కోవడానికి వెనుకాడటం లేదని ధ్వజమెత్తారు. ‘మా, మాతి, మనుష్’ నినాదాన్ని ఉపయోగించి తృణమూల్ ప్రభుత్వం బెంగాల్ మహిళలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుందని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్ ప్రజలు పేదలుగా ఉండాలని టిఎంసి కోరుకుంటుందని, తద్వారా వారి మురికి రాజకీయాలు కొనసాగించాలని భావిస్తున్నదని ప్రదాని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో రూ.15,000 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులను ప్రధాని శనివారం ప్రారంభించారు. రూ.940 కోట్లతో నాలుగు రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో బెంగాల్ ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారని చెప్పారు. టీఎంసీ ప్రభుత్వం రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసిందని.. ప్రజలు పదేపదే టీఎంసీని భారీ మెజారిటీతో గెలిపిస్తూ వచ్చినప్పటికీ అకృత్యాలు, మోసాలకు పర్యాయపదంపై ప్రభుత్వం మారిందని విమర్శించారు.
టీఎంసీ అంటే వంచన, అవినీతి, పరివార్‌వాద్ అని విమర్శించారు. బెంగాల్‌కు తొలి ఎయిమ్స్ గ్యారెంటీని తమ ప్రభుత్వం ఇచ్చిందని, కల్యాణిలో కొద్దిరోజుల క్రితం ఎయిమ్స్‌ను వర్చువల్ తరహాలో ప్రారంభిచానని చెప్పారు. అయితే పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి మాత్రం పర్యావరణ క్లియరెన్స్ ఇవ్వలేదని చెప్పారు. కమిషన్లు ఇవ్వకుంటే టీఎంసీ ప్రభుత్వం అన్ని పర్మిషన్లు రద్దు చేస్తుందని, మొదట కమిషన్, ఆ తర్వాతే పర్మిషన్ అని విమర్శించారు. మమత ప్రభుత్వం ప్రతి స్కీమ్‌ను స్కామ్‌గా మారుస్తోందని ఆరోపించారు.
More Stories
భారత్ లో ఓటింగ్‌ను పెంచేందుకు అమెరికా నిధులు?
లడ్డూ కల్తీ నెయ్యి సూత్రధారుల కోసం ఇక వేట
అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి కన్నుమూత