రేవంత్ ప్రభుత్వంకు సవాల్ ధరణి పోర్టల్!

రేవంత్  ప్రభుత్వంకు సవాల్ ధరణి పోర్టల్!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి దారితీసిన అనేక కారణాల్లో ధరణి పోర్టల్ వివాదం కూడా ఒకటి. ఈ పోర్టల్ నిర్వహణలో లక్షలాదిమంది భూ యజమానులు అనేక ఇబ్బందులు పడ్డారు. తమ సమస్యలను ఎన్నిసార్లు ప్రభుత్వానికి చెప్పుకున్నా ఎలాంటి ఉపయోగం లేకపోయింది. దాంతో కేసీఆర్ మీద యజమానాల్లో కోపం పెరిగిపోయింది.
 
యజమనాలను దగ్గరున్న భూవివరాలు వేరు పోర్టల్లోని వివరాలు వేరుగా ఉండేది. యజమానుల దగ్గరున్న పాస్ పుస్తకాలు, పత్రాల్లోని వివరాలను కాదని అధికార యంత్రాంగం పోర్టల్లోని వివరాలే కరెక్టని తేల్చేశాయి. దాంతో భూవిస్తీర్ణంలో చాలా తేడాలొచ్చేశాయి. విచిత్రం ఏమిటంటే పాస్ పుస్తకాలు, పత్రాల్లోని వివరాలు కూడా ఒకపుడు ప్రభుత్వ యంత్రాంగం నిర్ధారించినవే. 
 
తమ భూములను కాజేసేందుకు ప్రభుత్వం ధరణిపోర్టల్ ను అడ్డుపెట్టుకుందని భూయజమనాలు నిర్ధారణకొచ్చారు. దాంతో ఆందోళనలకు దిగారు. యజమానులు ఎన్ని ఆందోళనలు చేసిన యంత్రాంగం మాత్రం పోర్టల్లోని వివరాలే కరెక్టనే వాళ్ళు. ఈ పోర్టల్ ను కీలక ఎన్నికల అంశంగా చేసుకొని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వంకు దీనిని  మార్చడం, లోటుపాట్లను భర్తీ చేయడం సవాల్ గా మారుతుంది.
 
ప్రభుత్వం మారిన తర్వాత రేవంత్ రెడ్డి పోర్టల్ పై వస్తున్న ఆరోపణలపై లోతుగా విచారణ చేయిస్తున్నారు. దీంతో అసలు విషయాలు బయటపడుతున్నాయి. 
పోర్టల్ నిర్వహణ మొత్తం ప్రభుత్వ యంత్రాంగం ద్వారా కాకుండా టెర్రాసిస్ అనే ప్రైవేటు కంపెనీ చేతిలో ఉండేదట. టెర్రాసిస్ కంపెనీ కూడా అమెరికా నుండి పోర్టల్ ను నిర్వహిస్తోందట. 
 
అంటే తెలంగాణాలోని భూవివరాలు అమెరికా కంపెనీ గుప్పిట్లో ఉన్నట్లు తేలింది. అనేక కంపెనీలు చేతులు మారి టెర్రాసిస్ తో కాంట్రాక్టు గడువు ముగిసినా ఇంకా అదే కంపెనీ నిర్వహణలో పోర్టల్ నడుస్తుండటమే ఆశ్చర్యంగా ఉందని మంత్రులే కామెంట్ చేస్తున్నారు.
 
ప్రభుత్వ పెద్దల ఇష్టారాజ్యంగా వట్టినాగులపల్లి, కోకాపేట, ఔటర్ రింగ్ రోడ్డు, గండిపేట, హైటెక్ సిటి ప్రాంతాల్లో కోట్ల రూపాయలు విలువచేసి వేలాది ఎకరాలు పోర్టల్ ద్వారా చేతులు మారినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారట. టెర్రాసిస్ కంపెనీని ఫాల్కన్ ఇన్వెస్టిమెంట్స్ కంపెనీ కొనేసిందట. తర్వాత ఫాల్కన్ కంపెనీ షేర్లను నూరుశాతం క్వాంటెలా కొనేసిందట. 
 
ప్రభుత్వంతో సంబంధంలేకుండానే ధరణి పోర్టల్ ను నిర్వహిస్తున్న కంపెనీలు చేతులు మారిపోతున్నా కేసీయార్ ప్రభుత్వం పట్టించుకోలేదని విజిలెన్స్ గుర్తించినట్లు సమాచారం. అందుకనే ధరణిపోర్టల్ పాపాలకు మూలకారుకులు ఎవరనే విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తేల్చబోతుంది.