రోహిత్, జడేజా సెంచరీల మోత

సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో తొలి రోజు టీమిండియా బ్యాట్స్ మెన్లు అదరగొట్టారు. కెప్టెన్ రోహిత్ శర్మ(131), రవీంద్ర జడేజా(110)లు సూపర్ సెంచరీలతో చెలరేగారు. వీరికి తోడుగా తొలి టెస్ట్ ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్(62) కూడా మెరుపులు మెరించాడు. 

దీంతో తొలి రోజు ఆట ముగిసేసమయానికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 86 ఓవర్లలో 326 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించి భారత్ కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (10)తోపాటు రజత్ పాటీదర్(05), శుభమన్ గిల్(0)లు వెంటవెంటనే పెవిలియన్ కు చేరడంతో 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన తరుణంలో రవీంద్ర జడేజాతో కలిసి మరో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చాడు.

ఈ క్రమంలో రోహిత్ టెస్టుల్లో 11వ శతకాన్ని పూర్తి చేశాడు. రోహిత్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్(62 పరుగులు, 66 బంతుల్లో) అర్థ సెంచరీతో చెలరేగాడు. అనంతరం జడేజా కూడా శతకం బాదాడు. టెస్టుల్లో జడేజాకు ఇది నాలుగో సెంచరీ. ప్రస్తుతం క్రీజులో జడేజా(110), కుల్దీప్ యాదవ్(01)లు ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ హుడ్ మూడు వికెట్లు పడగొట్టగా.. టామ్ హార్ట్లీ ఒక వికెట్ తీశాడు.

మూడో టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా  మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే మొదటి 45 నిమిషాల ఆట ముగిసే సరికి 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. యశస్వి (10), శుభ్‌మన్ గిల్ (0), రజత్ పటీదార్ (5) విఫలమయ్యారు. 

ఈ సమయంలో క్రీజులో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మకు బ్యాటింగ్ లో ప్రమోషన్ పొందిన రవీంద్ర జడేజా జత కలిశాడు. అసలు అనుభవం లేని మిడిలార్డర్ కు వెన్నెముకగా నిలుస్తూ జడేజా అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్ కు ఏకంగా 204 పరుగులు జోడించారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ టెస్టుల్లో తన 11వ సెంచరీ చేశాడు.

ఇంగ్లండ్ పై అతనికిది మూడో సెంచరీ కావడం విశేషం. సాధారణంగా ఏడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చే జడేజా ఈ ఇన్నింగ్స్ లో టీమ్ ను కష్టకాలంలో ఆదుకునేందుకు తొలి టెస్టు ఆడుతున్న సర్పరాజ్ ధృవ్ జురెల్ కంటే ముందుగా ఐదో స్థానంలో వచ్చాడు. సెంచరీ తర్వాత కూడా జోరు మీద కనిపించిన రోహిత్ శర్మ 131 రన్స్ చేసిన తర్వాత ఔటయ్యాడు. 

ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ అదరగొట్టాడు. అసలు తొలి టెస్ట్ ఆడుతున్న ప్లేయర్ గా కనిపించలేదు. వచ్చీ రాగానే ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ముఖ్యంగా స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకుంటూ బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 48 బంతుల్లో ఆడిన తొలి టెస్ట్ ఇన్నింగ్స్ లోనే హాఫ్ సెంచరీ చేశాడు.

జడేజాతో కలిసి ఐదో వికెట్ కు సర్ఫరాజ్ 77 పరుగులు జోడించాడు. అందులో సర్ఫరాజ్ స్కోరే 62 పరుగులంటే అతడు ఏ వేగంతో ఆడాడో అర్థం చేసుకోవచ్చు. చివరికి 99 పరుగులు దగ్గర ఉన్న జడేజా తన సెంచరీ పరుగు కోసం తొందరపడటంతో సర్ఫరాజ్ రనౌటయ్యాడు. ఆ తర్వాతి బంతికే జడేజా టెస్టుల్లో నాలుగో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తన సొంతగడ్డ అయిన రాజ్‌కోట్ లో అతనికిది రెండో సెంచరీ.