ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30లో రష్మిక మందన్నా

ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ తన వార్షిక 30 అండర్ 30 జాబితాను గురువారం విడుదల చేసింది. ఇందులో 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 30 మంది “ట్రయల్‌బ్లేజర్స్ అండ్ డిస్ట్రప్టర్స్”ను ఎంపిక చేసింది. ఈ ఏడాది జాబితాలో ఎంటర్టైన్మెంట్ స్పేస్ నుండి తెలిసిన ముగ్గురు నటీమణులు రాధికా మదన్, రష్మిక మందన్న, డాట్ ఉన్నారు.

27 ఏళ్ల రష్మిక మందన్న తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తోంది. గత ఏడాది ఆమె నటించిన మూడు సినిమాలు విడుదలయ్యాయి. మొదట, ఆమె తమిళ సూపర్ స్టార్ విజయ్ తో కలిసి వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో వచిన యాక్షన్ చిత్రం వారిసులో నటించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.300 కోట్లు వసూలు చేసింది.

ఇక రెండోది, సిద్ధార్థ్ మల్హోత్రా సరసన శంతను బాగ్చి డైరెక్ట్ చేసిన స్పై థ్రిల్లర్ మిషన్ మజ్నులో నటించింది. ఇది నేరుగా నెట్ ఫ్లిక్స్  ఓటీటీలోనే విడుదలైంది. మూడోది, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో తెరకెక్కిన ఫ్యామిలీ క్రైమ్ డ్రామా యానిమల్ లో కథానాయికగా నటించింది. ఇందులో ఆమె రణబీర్ కపూర్ సరసన నటించింది.  హిందీ, తెలుగుతో పాటు ఇతర భాషల్లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రూ.900 కోట్లకు పైగా వసూలు చేసింది.

రాధికా మదన్ 28 ఏళ్ల నటి. హిందీ చిత్రాలలో నటిస్తోంది. గత ఏడాది ఆమె మూడు సినిమాల్లో నటించింది. ఆమె ఆస్మాన్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన క్రైమ్ డ్రామా కుట్టేలో సహాయక పాత్రతో 2023 ఏడాదిని ప్రారంభించింది. ఆ తర్వాత శుభం యోగి దర్శకత్వం వహించిన స్పోర్ట్స్ డ్రామా కచ్చే లింబూని నేరుగా జియోసినిమాలో విడుదల చేశారు.

చివరగా, ఆమె మిఖిల్ ముసాలే డైరెక్ట్ చేసిన మిస్టరీ మూవీ సజినీ షిండే కా వైరల్ వీడియోతో 2023 సంవత్సరాన్ని ముగించింది. ఏదేమైనా, డిస్నీ + హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అయిన హోమీ అడాజానియా క్రైమ్ డ్రామా సాస్, బహు ఔర్ ఫ్లెమింగోలో ఆమె నటనకు చాలా మంది ఫిదా అయ్యారు.  ఈ ఏడాది రాధిక సనా, సర్ఫీరా చిత్రాల్లో కనిపించనుంది.

25 ఏళ్ల అదితి ఈ ముగ్గురిలో చిన్న వయసున్న ఆర్టిస్ట్. ఆమె ఒక గాయని, సంగీతకారిణి. ఆమె స్టేజ్ పేరు డాట్. ఆర్చీ కామిక్స్ మొదటి ఫీచర్ అనుసరణ అయిన జోయా అక్తర్ డైరెక్ట్ చేసిన పీరియడ్ కమింగ్-ఆఫ్ ఏజ్ మ్యూజికల్ ది ఆర్చీస్ లో ఆమె ఎథెల్ పాత్రలో నటించింది. ఇది నేరుగా నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో విడుదలైంది.