
భారత సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమంలో కళలు, సంగీతం పెద్ద ఎత్తున దోహదపడుతున్నాయిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ తెలిపారు. భాగ్యనగర్‌లోని ఘట్‌కేసర్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ గురువారం నిర్వహించిన ““స్వరఝరి” కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ఈ స్వరఝరి కార్యక్రమం నిర్వహిస్తున్న స్వయంసేవకులను, నిర్వాహకులను డా. భగవత్ ప్రత్యేకంగా అభినందించారు. మొత్తం 81 మంది ఎంపిక చేసిన ఘోష్ వడకులు వివిధ సంగీత వాయిద్యాలను లయబద్ధంగా వాయించారు. శంఖ, వేణు, శృంగ, ఆనక్, పణవ, ఝల్లరి, త్రిభుజీ వాద్యాలతో భారతీయ రాగాల ఆధారంగా రూపొందించిన రచనలతో కూడిన వాయిద్య వాదన ఆధ్యంతం అలరించింది.
అలాగే శివలింగం, త్రిశూలం వ్యూహం, రామ్ మందిరం, కోదండం, భారత నౌకాదళం నూతన చిహ్నం, శివాజీ కాలంలోని అష్టభుజ, యుద్ధ నౌక తేజస్, విక్రమ్ ల్యాండర్, రోవర్, వ్యూహలతో బాటు సంఘ్ సమత (కవాతు) ప్రదర్శన నిర్వహించారు. ప్రత్యేకంగా పెద్దపులి పాట, లింగాస్టకం, రామ్ సియారామ్, సైడ్ డ్రమ్ వాదన అబ్బుపర్చాయి.
ప్రముఖ సంగీత విద్వాంసుడు ఎంఎం కీరవాణి ఈ స్వరజారీలో ప్రత్యేక అతిధిగా పాల్గొన్నారు. ప్రముఖ సంగీత విద్వాంసులు ఆర్‌పి పట్నాయక్, కొమండూరి రామాచారి, కెఎం రాధాకృష్ణ, ఎంఎం శ్రీలేఖ, సంగీత విద్యావేత్తలు ప్రేమా రామ్‌మూర్తి, వేణు గాన పండితులు, కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీతలు, ఇతర సంగీత విద్వాంసులు, పలు రంగాల్లోని నిపుణులు పాల్గొన్నారు.
More Stories
హైదరాబాద్ శివాలయంలో మాంసపు ముద్దలు
బీజేపీలోకి ఇద్దరు కాంగ్రెస్ నేతలు ప్రవేశం
కుంభమేళాకు వెళ్లి వస్తుండగా 8 మంది తెలంగాణ వాసుల మృతి