రోడ్డు వెడల్పుకు అడ్డంగా చర్చ్ రావడంతో గ్రామ ఘర్షణలు

శంకరపల్లి మండలం దువ్వాడ గ్రామంలో ప్రభుత్వ రోడ్డు వెడల్పు పనులు చేస్తుంటే మార్గమధ్యంలో చర్చి  అడ్డు రావడంతో గ్రామంలో ఘర్షణలకు దారితీసింది. అక్కడ గ్రామస్తులు రోడ్ ను వెడల్పు చేయాలని పట్టుబట్టడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. 
 
అయితే, ఈ ఘర్షణను పక్క గ్రామంలో ఉన్నటువంటి ఒక పాస్టరు వీడియో తీసి వైరల్ చేయడం ద్వారా రెండు మతాల మధ్య ఘర్షణగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అందుకు మద్దతుగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, బి ఎస్ పి రాష్ట్ర అధ్యక్షుడు  ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్  గ్రామంలో ఉద్రిక్తలను రెచ్చకొట్టే విధంగా చర్చిపై దాడి చేశారని, చర్చిని ధ్వంసం చేశారని, స్థానిక దళితులపై ఘర్షణాలకు పాల్పడ్డారని అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశారు.
 
పైగా, ఈ ఘర్షణలలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నరని పేర్కొంటూ  ఆర్ఎస్ఎస్, ఎబివిపి మూలాలున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణాలో మైనారిటీలను, దళితులను అణచివేయడంలో కాంగ్రెస్, బీజేపీ ఉమ్మడిగా పనిచేస్తున్నాయని అభూత కల్పనలకు ప్రవీణ్ కుమార్ దిగారు.
ఆర్ఎస్ఎస్ గాని, దానికి సంబంధించిన సంస్థలు గాని ఎప్పుడూ గ్రామాలలో ఉద్రిక్తలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించవు. గ్రామస్థుల మధ్య సామరస్యం కోసమే కృషి చేస్తుంటాయి.
 
రంగారెడ్డి జిల్లా మోకిలా పోలీస్ స్టేషన్ పరిధి జనవాడ గ్రామంలో తమ చర్చి ముంగట రోడ్డు వేయకూడదని క్రైస్తవ (బీసీ -సీ) యువకులు గ్రామ పెద్దలతో వాగ్వాదానికి దిగారు. ఇదేంటని ప్రశ్నించిన వారిపై రాళ్లతో దాడి చేశారు. చిన్న పెద్ద తేడా లేకుండా దొరికిన వారిని దొరికినట్లుగా అత్యంత దారుణంగా కర్రలతో దాడి చేశారని గ్రామస్తులు  తెలిపారు. 
 
విషయం తెలుసుకున్న మోకిలా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాధ్యులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. అయితే ఈ ఘటనకు పాల్పడిన యువకులు గ్రామంలో శాంతి భద్రతలకు తరచూ విఘాతం కలిగిస్తున్నారని చెబుతున్నారు. 
 
పైగా,  ఆ మధ్యకాలంలో జనవాడ పెట్రోల్ బంక్ లో పెట్రోల్  పోయించుకొని.  డబ్బులు అడిగినందుకు పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న యువకుడిని అతి దారుణంగా చంపిన ఘటన నిందితులు కూడా అదే బస్తీకి చెందినవారు కావడం గమనార్హం,  వారే దాడి చేసి వారే దళితులపై దాడి అని విష ప్రచారం చేయడం విడ్డూరంగా గ్రామస్థులు వాపోతున్నారు. అదీగాక,  క్రైస్తవులు(బీసీ -సీ) దళితులు(ఎస్సీ )ఎలా అవుతారని గ్రామంలోని చైతన్యవంతులైన యువకులు ప్రశ్నిస్తున్నారు.