ప్ర‌పంచ‌కప్ జ‌ట్టులో న‌లుగురు టీమిండియా ఆటగాళ్లు

ప్ర‌తిష్ఠాత్మ‌క అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్‌()లో ఆసాంతం అద‌ర‌గొట్టిన యువ భార‌త్ ఆఖ‌రి మెట్టుపై బోల్తా ప‌డింది. ఆస్ట్రేలియా సవాల్‌ను అధిగ‌మించ‌లేక ర‌న్న‌ర‌ప్‌తో స‌రిపెట్టుకుంది. దాంతో, ఆరోసారి టైటిల్ నెగ్గాల‌నుకున్న టీమిండియా క‌ల క‌ల‌గానే మిగిలింది. టోర్నీ ముగియ‌డంతో ఈఎస్‌పీఎన్ క్రిక్ఇన్ఫో అండ‌ర్ -19 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్టును ప్ర‌క‌టించింది. 

ఈ టీమ్‌లో ఏకంగా న‌లుగురు భార‌త కుర్రాళ్లు ఉన్నారు. ఈ మోగా టోర్నీలో అద్భుతంగా రాణించిన‌ ఉద‌య్ స‌హ‌ర‌న్, ముషీర్ ఖాన్, స‌చిన్ ధాస్, సౌమీ పాండేలు చోటు ద‌క్కించుకున్నారు. ఇక‌ ఆసీస్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన హగ్ విబ్జెన్, హ్యారీ డిక్స‌న్, క‌ల్లం విడ్ల‌ర్‌లు ఈ జ‌ట్టుకు ఎంపిక‌య్యారు. 

ద‌క్షిణాఫ్రికా పేస‌ర్ మ‌ఫకా, విధ్వంస‌క ఆట‌గాడు ప్రిటోరియ‌స్‌ల‌తో పాటు, పాక్ పేస‌ర్ ఉబైద్ షాలు ఈ టీమ్‌లో ఉన్నారు. వెస్టిండీస్ ఆట‌గాడు జెవెల్ ఆండ్రూ వికెట్ కీప‌ర్‌గా ఎంపిక‌య్యాడు. సొంత‌గ‌డ్డ‌పై జ‌రిగిన ఈ టోర్నీలో 21 వికెట్లు ప‌డ‌గొట్టిన మ‌ఫ‌కా ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్న‌మెంట్’ అవార్డు అందుకున్నాడు.

అండ‌ర్ -19 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్టు : ఉద‌య్ స‌హ‌ర‌న్, ముషీర్ ఖాన్, స‌చిన్ ధాస్, సౌమీ పాండే, నాథ‌న్ ఎడ్వ‌ర్డ్. కల్ల‌మ్ విడ్ల‌ర్, ఉబైద్ షా, క్వెనా మ‌ఫ‌కా, జెవెల్ అండ్రూ(వికెట్ కీప‌ర్), హగ్ విబ్జెన్(కెప్టెన్), లాన్ డ్రె ప్రిటోరియ‌స్, హ్యారీ డిక్స‌న్.

ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్లో ఆస్ట్రేలియా 79 ప‌రుగుల తేడాతో భార‌త్‌ను ఓడించింది. తొలుత 253 ప‌రుగుల‌ భారీ స్కోర్ చేసిన ఆసీస్.. ఆ త‌ర్వాత టీమిండియాను 174కే క‌ట్ట‌డి చేసింది. పేస‌ర్ మ‌హ్లి బియ‌ర్డ్‌మ‌న్ మూడు కీల‌క వికెట్లు తీసి భార‌త్‌ను దెబ్బ‌కొట్టాడు. 

చివ‌ర్లో మురుగ‌న్ అభిషేక్(42) పోరాడినా జ‌ట్టును గెలిపించ‌లేక‌పోయాడు. సౌమీ పాండే(2)ను టామ్ స్ట్రాక‌ర్ ఔట్ చేయ‌డంతో ఆసీస్ నాలుగోసారి అండ‌ర్ -19 ప్ర‌పంచ‌క‌ప్ చాంపియన్‌గా అవ‌త‌రించిం