ధూమపానం మూడేళ్లు మానేస్తే ఆయుర్దాయం రెట్టింపు

ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని ఎన్ని దృష్టాంతాలు కనిపిస్తున్నా, ప్రభుత్వం ఎంతగా ప్రచారం చేస్తున్నా నా దాన్ని మానేయటానికి చాలా మంది ఆసక్తి చూపించడం లేదుర.  అయితే, ధూమపానంను మధ్యలో మానేయటం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది.
 
 ఏ వయస్సులోనైనా పొగ తాగడాన్ని మానేయటం వల్ల మరణించే ప్రమాదం గణనీయంగా తగ్గిపోతుందని పరిశోధనల్లో వెల్లడైంది. అంతేకాకుండా, మూడు సంవత్సరాల పాటు స్మోకింగ్‌ చేయకుండా ఉంటే వారి ఆయుర్దాయం రెట్టింపు అవుతుందట.  40 ఏండ్లలోపు పొగ తాగడాన్ని మానేస్తే వారు స్మోకర్లు కానేకారని అధ్యయనకారులు తెలిపారు. 
 
సాధారణ మనుషుల్లాగే వారూ జీవించవచ్చని ఇటీవల వెలువడిన ఓ నివేదకలో పేర్కొన్నారు. టొరంటో విశ్వవిద్యాలయం డల్లాలానా స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ప్రొఫెసర్‌ ప్రభాత్‌ ఝా ఈ పరిశోధనలపై వ్యాఖ్యానిస్తూ ధూమపానం మానేయటమన్నది లైఫ్‌ రిస్క్‌ను నిస్సందేహంగా తగ్గిస్తుందని తెలిపారు.యూఎస్‌, యూకే, కెనడా, నార్వేలలో 1.5 మిలియన్ల మందిపై చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెలుగు చూసింది.  ధూమపానం చేయని వారితో పోలిస్తే 40 నుంచి 79 సంవత్సరాల వయస్సు గల  ధూమపానం చేసేవారు  చనిపోయే ప్రమాదం 3 రెట్లు ఎక్కువగా ఉన్నట్టు కనుగొన్నారు. 

ధూమపానం వల్ల సగటున 12 నుంచి 13 సంవత్సరాల జీవితాన్ని కోల్పోతున్నారు. అయితే కొంతకాలం  ధూమపానం చేసి మానేసిన వారికి చనిపోయే ప్రమాదం 1.3 రెట్లు తగ్గిందని కనుగొన్నారు.