2022-23లో ఎలెక్టోరల్ బాండ్ల నుంచి బిజెపికి రూ.1300 కోట్లు

2021-22 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి వచ్చిన మొత్తం విరాళాలు రూ.1775 కోట్లు. 2021-22 నాటి ఆదాయం రూ.1917 కోట్లు కన్నా 2022-23లో మొత్తం ఆదాయం రూ.2366.8 కోట్ల వరకు అధిగమించింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీని పరిశీలిస్తే ఆ పార్టీకి 2021-22లో రూ.236 కోట్లు ఆదాయం రాగా, 2022-23 నాటికి రూ.171కోట్ల వరకు తగ్గింది. 

బీజేపీ, కాంగ్రెస్ జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందాయి. రాష్ట్రస్థాయి పార్టీగా గుర్తింపు పొందిన సమాజ్‌వాది 2021-22లో ఎలెక్టోరల్ బాండ్ల ద్వారా రూ.3.2 కోట్ల వరకు విరాళాల మొత్తం ఆదాయాన్ని పొందగలిగినప్పటికీ, 2022-23 నాటికి ఈ బాండ్ల నుంచి ఎలాంటి విరాళాలు పొందలేక పోయింది.

మరో రాష్ట్ర స్థాయి పార్టీ టీడీపీ 2022-23లో రూ.34 కోట్లు ఆర్జించగా, అంతకు ముందు సంవత్సరం కన్నా పది రెట్లు ఎక్కువగానే పొందగలిగింది. వడ్డీల రూపంలో బీజేపీ 2021-22లో రూ.135 కోట్లు పొందగా, 2022-23లో రూ.237 కోట్ల వరకు ఎక్కువగా సాధించగలిగింది. 

ఎన్నికలు, ప్రచారానికి సంబంధించి విమానాలు, ఎయిర్ క్రాఫ్ సర్వీస్‌ల కోసం 2021-22లో రూ.117.4 కోట్లు బీజేపీ చెల్లించగా, 2022-23లో ఆ సర్వీస్‌ల కోసం కేవలం రూ.78.2 కోట్లు మాత్రమే చెల్లించింది. అంతకు ముందుకన్నా ఈ ఖర్చు బాగా తగ్గింది. బీజేపీ తన అభ్యర్థులకు 2021-22లో రూ.146.4 కోట్లు ఆర్థిక సహాయాన్ని అందించగా, 2022-23లో ఆ సాయం కేవలం రూ.76.5 కోట్లు మాత్రమే పరిమితమైంది.