ఉత్తరాఖండ్‌లో మజార్ జీహాద్‌కు కారకులెవరు?

ఉత్తరాఖండ్.. దేవభూమిగా భావించే పుణ్యభూమి అది. అటువంటి దేవభూమి.. ఉత్తరాఖండ్ లో గత కొన్నేళ్ళుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ స్థలాలు, అటవీ భూముల్లో విచ్చలవిడిగా వెలుస్తున్న మసీదులు, మదర్సాలు సమాధులు ( మజార్స్ ) తో హిందువులు దేవభూమి కాస్ ముస్లింల మరుభూమిగా మారిపోతోంది. వేద ప్రవచనాలతో మార్మోగిన ప్రాంతం.. ఆల్లాహొ అక్బర్ నినాదాలతో హోరెత్తిపోతోంది.
తాజాగా హల్ద్వానీలోని ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించిన మసీదు, మదర్సా, ఇతర కట్టడాలను కోర్టు ఆదేశాలతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూల్చివేసింది. దీంతో రెచ్చిపోయిన ఇస్లామిక్, రొహింగ్యా మూకలు తీవ్ర విధ్వంసానికి, దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జరిగిన పోలీసు కాల్పులు, హింసాత్మక ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు.
గత కొన్నేళ్ళుగా బంగ్లాదేశ్ నుంచి అడ్డు, అదుపు లేకుండా అక్రమంగా కొనసాగున్న ముస్లింల చొరబాట్ల ఫలితమే..ఉత్తరాఖండ్‌లో తాజా పరిణామాలకు కారణమనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లో ఒకప్పుడు అతి తక్కువ సంఖ్యలో ముస్లింలు ఉండేవారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పొట్టచేతపట్టుకుని జీవన భృతి కోసం వచ్చిన ముస్లింలు కనిపించే వారు. కానీ.. ఆ తరువాత బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్లు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా రొహింగ్యా ముస్లింలు వెల్లువలా వచ్చి తిష్టవేసేశారు.
కొండలు, లోయలు, అటవీ భూముల్ని ఆక్రమించటం మొదలు పెట్టారు. దీంతో మొదట్లో 1.4 శాతం వరకు ఉన్న ముస్లింల జనాభా ప్రస్తుతం 14 శాతాన్ని క్రాస్ చేసింది. వీరి ఆధ్వర్యంలోనే ఉత్తరాఖండ్ వ్యాప్తంగా మసీదులు, మదర్సాలు, ముస్లిం మత ప్రవక్తల పేరుతో సమాధులు ( మజార్స్ ) పుట్టగొడుగుల్లా వెలిసాయి. ముఖ్యంగా రోడ్లకు ఇరువైపులా, అటవీ భూముల్లో వెలసిన సమాధులు.. కాల క్రమంలో ముస్లింల ప్రార్థనా మందిరాలుగా రూపాంతరం చెందుతున్నాయి. చివరకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో “మజార్ జీహాద్”కు దారి తీస్తున్నాయి.
ఓ అంచనా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 1000 నుంచి 1500కు పైగా మజార్‌లుగా పిలిచే  ముస్లిం సమాధులు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ఇవన్నీ ప్రభుత్వ, అటవీ భూముల్లో వెలసిన అక్రమ కట్టడాలుగా ప్రభుత్వం తేల్చింది. దీంతో.. గత రెండేళ్ళ నుంచి వీటిని తొలగించే కార్యక్రమానికి సీఎం పుష్కర్ సింగ్ ధామీ శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ, అటవీ శాఖ భూముల్లో అక్రమంగా వెలిసిన మాజార్లను గత ఏడాది నుంచి పెద్ద సంఖ్యలో కూల్చి వేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 500కు పైగా అక్రమ మజార్లు నేలమట్టం అయ్యాయి. అదే విధంగా మున్సిపల్ శాఖ భూముల్లో వెలసిన అక్రమ మసీదులు, మదర్సాలపై సైతం ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కోర్టు నుంచి రూట్ క్లియర్ అవ్వగానే వాటిని నేలమట్టం చేస్తోంది.
అయితే.. ప్రభుత్వ భూముల్లో మసీదులు, మదర్సాలు, మజార్లను నిర్మిస్తూ.. ఉత్తరాఖండ్‌ను ఇస్లామీకరణ చేద్దామనుకున్న శక్తులకు మాత్రం.. తాజా పరిణామాలు మింగుడు పడటం లేదు. ఈ క్రమంలోనే  హల్ద్వానీలో జరుగుతున్న అక్రమ కట్టడాల కూల్చివేతను సాకుగా తీసుకున్నాయి. సామాన్య జనం ముసుగేసుకున్న ముస్లిం మతోన్మాదులు రెచ్చిపోయారు. దారుణమైన హింసాత్మక ఘటనలకు పాల్పడుతూ.. ప్రభుత్వాన్ని దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.