ఈ సమాచారం భారత్‌కు భారీ ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొన్నారు. సతేందర్‌ది హాపూర్ జిల్లా షమహిద్దుయూన్‌పుర్‌గా గుర్తించారు. అతడు మాస్కోలోని కార్యాలయంలో 2021 నుంచి ఇండియా బేస్డ్ సెక్యూరిటీ అసిస్టెంట్‌గా (ఐబీఎస్ఏ)గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. పాక్ గూఢచర్య నెట్‌వర్క్‌లో అతడు కీలక వ్యక్తని అధికారులు చెబుతున్నారు.
తన హోదాను అడ్డం పెట్టుకుని అతడు ముఖ్య పత్రాలను సంపాదించాడు. వీటిల్లో రక్షణ, విదేశాంగ శాఖ నిర్ణయాలు, సైన్యం రోజువారీ కదలికలు వంటి వివరాలున్నాయి. భారత ప్రభుత్వ అధికారులను ప్రలోభాలకు గురిచేసి వారి నుంచి భారత సైన్యం, దైనందిన కార్యకలాపాల గురించి సమాచారం రాబట్టినట్టు దర్యాప్తులో సత్యేంద్ర సివల్ అంగీకరించాడు. ఈ సమాచారాన్ని పాక్‌లోని ఐఎస్ఐ ప్రతినిధులకు చేర్చాడు. అతడి కదలికలపై నిఘా పెట్టిన తర్వాతే ఏటీఎస్ అధికారులు మీరట్ కు విచారణకు పిలిపించారు.
అడిగిన ప్రశ్నలకు అతడు సరైన సమాధానాలు ఇవ్వలేదు. చివరికి తాను పాక్‌కు గూఢచర్యం చేస్తున్నట్లు అంగీకరించాడు. భారత రాయబార కార్యాలయం, రక్షణ మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సంబంధించిన కీలక, రహస్య సమాచారాన్ని ఐఎస్ఐకి చేరవేసినట్టు దర్యాప్తులో గుర్తించారు. దీంతో అతడిని అరెస్ట్ చేశారు.

More Stories
ప్రతి చొరబాటుదారుడిని గుర్తించి దేశం నుంచి పంపిస్తాం
బీఎంసీ ఎన్నికల్లో బిజెపి 150 సీట్ల వరకు పోటీ!
ఆత్మహత్యకు పాల్పడిన వైద్యురాలిపై ఓ ఎంపీ వేధింపులు!