హిందూపురం నుంచి పోటీకి పరిపూర్ణానంద ఆసక్తి

బీజేపీ నేత, కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి కీలక ప్రకటన చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా బరిలోకి దిగేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ప్రకటింఛారు. హిందూపురం ఎంపీగా పోటీ చేసేదుంకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. దేశంలోనే ఆ నియోజవర్గానికి ఓ ప్రత్యేక ఉందని, అందుకే అదిష్ఠానం ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు.
 
‘దేశంలోనే హిందూ శబ్దంతో పేరున్న నియోజకవర్గం హిందూపురం మాత్రమే. ఇక్కడి నుంచి ఎంపీగా పోటీచేసి గెలిచి పార్లమెంటుకు వెళ్లి, ఈ ప్రాంత ప్రాధాన్యాన్ని ఢిల్లీలో చెప్పాలని ఉంది. ఇప్పటికే ఈ విషయాన్ని బీజేపీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లా. వారు అంగీకరిస్తారని ఆశిస్తున్నా. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితోనూ ఎంపీగా పోటీ చేసే విషయమై చర్చించా’ అని ఆయన తెలిపారు.
 
హిందూపురంలో హిందూ మత ప్రచారం, వ్యాప్తిలో స్వామి పరిపూర్ణానంద కొంత కాలంగా క్రియాశీలకంగా ఉన్నారు. కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దు కావటం, దక్షిణాది రాష్ట్రాలు, భాషల్లో పట్టుుండటం ఆయనకు కలిసొచ్చే అంశం. 2018లో బీజేపీలో చేరిన ఆయన ఆ  సమయంలో తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికలలో బిజెపి ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. అయితే, ఆ తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.