మాగ్నెటోమీటర్‌ బూమ్‌ను ప్రయోగించిన ఆదిత్య ఎల్‌-1

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆదిత్య ఎల్‌-1 నుంచి మాగ్నెటోమీటర్‌ బూమ్‌ను విజయవంతంగా ప్రయోగించింది. దీని సహాయంతో అంతర్ గ్రహ అయస్కాంత క్షేత్రాన్ని కొలవడం దీని ఉద్దేశ్యం. మాగ్నోమీటర్ బూమ్ ఆరు మీటర్ల పొడవు ఉంటుంది. 

ఇది జనవరి 11న  ఎల్‌- 1 పాయింట్‌లోని హెలో ఛాంబర్‌లో మోహరించామని, ప్రయోగం తర్వాత బూమ్ స్థిరమైన స్థితిలో ఉందని ఇస్రో తెలిపింది. మాట్నెటోమీటర్‌ బూమ్‌లో రెండు అత్యాధునికమైన ఫ్లెక్స్‌గేట్ మాగ్నోమీటర్ సెన్సార్‌లు ఉన్నాయి. ఇవి అంతరిక్షంలో తక్కువ తీవ్రత అంతర్ గ్రహ అయస్కాంత క్షేత్రాన్ని కొలుస్తుంటాయి.

వ్యోమనౌక నుంచి మూడు, ఆరు మీటర్ల దూరంలో ఈ సెన్సార్లు అమర్చబడి ఉంటాయి. దూరంలో ఈ సెన్సార్‌లను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా స్పేస్‌షటిల్‌ అయస్కాంత క్షేత్రం ప్రభావం తగ్గుతుంది. సెన్సార్లను ఉపయోగించడం ఈ ప్రభావాన్ని ఖచ్చితంగా అంచనా వేయడంలో సహాయపడుతుందని, వ్యోమనౌక అయస్కాంత ప్రభావాన్ని తగ్గించడాన్ని సులభతరం చేస్తుందస్స్రో పేర్కొంది. 

బూమ్‌ను కార్బన్ ఫైబర్‌తో తయారు చేసినట్లు ఇస్రో వివరించింది. ఇది సెన్సార్‌లకు ఇంటర్‌ఫేస్‌గా పని చేస్తుందని. ఇదిలా ఉండగా.. ఆదిత్య ఎల్‌-1 మిషన్‌ను సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపట్టిన తొలి మిషన్‌. 

భూమి నుంచి దాదాపు 1.5 మిలియన్‌ కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్‌-1 పాయింట్‌లోకి ఉపగ్రహం చేరుకుంది. గతేడాది సెప్టెంబర్‌ 2న ప్రయోగించగా.. 127 రోజుల తర్వాత నిర్ధిష్ట కక్ష్యలోకి చేరుకుంది. ఎల్‌-1 పాయింట్ వద్ద నుంచి సౌర తుఫానులు తదితర అంశాలపై అధ్యయనం చేయనున్నది.