ప్రత్యక్ష ప్రసారంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం

అయోధ్య రామ మందిర్ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికే అనేక మంది వెళుతుండగా, అక్కడికి వెళ్లలేని వారు సైతం ఇంట్లో కుటుంభం సభ్యులతో కలిసి టీవీలలో ప్రత్యక్ష ప్రసారాలలో వీక్షించవచ్చు.

ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చూడడానికి అయోధ్యకు వెళ్లలేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయోధ్యలో జరుగుతున్న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్నిదాదాపు అన్ని న్యూస్ ఛానల్స్ లలో వీక్షించవచ్చు. అయోధ్యలో జరుగుతున్న రామాలయం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సహా, అధ్యాత్మిక కార్యక్రమాలన్నింటినీ ప్రత్యేక ప్రసారంలో అందిస్తున్నారు. 

ఈ కార్యక్రమం డిడి న్యూస్, దూరదర్శన్ జాతీయ ఛానెల్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. అలాగే డిడి న్యూస్ యూట్యూబ్ ఛానెల్‌లో కూడా వీక్షించవచ్చు. డీడీ న్యూస్ అయోధ్యలోని పలు ప్రాంతాల్లో 40 కెమెరాలను ఏర్పాటు చేసింది. వాటి ద్వారా రామమందిరం ప్రాణ్ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చూపించబడుతుంది. 

ప్రధాన ఆలయ ప్రాంగణంతో పాటు సరయూ ఘాట్ సమీపంలోని రామ్ కి పైడి, కుబేర్ తిలా వద్ద ఉన్న జటాయు విగ్రహం, ఇతర ప్రదేశాల నుంచి ప్రత్యక్ష ప్రసార దృశ్యాలను చూపిస్తారు. ఈ వేడుకను అత్యాధునిక 4కె టెక్నాలజీలో ప్రసారం చేయనున్నారు. రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 22న మధ్యాహ్నం 12:29 మధ్యాహ్నం 8 సెకన్ల నుంచి 12:30 నిమిషాల 32 సెకన్ల వరకు జరగనుంది. ఈ క్రమంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.