పోర్నోగ్రఫీ కారణంగా అణచివేతను ఎదుర్కొంటున్న కామం

లైంగిక ఆనందం దేవుడిచ్చిన వరమని, కానీ అది చివరకు పోర్నోగ్రఫీ కారణంగా అణచివేతను ఎదుర్కొంటోందని క్రైస్తవ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ వ్యాఖ్యానించారు. పోర్నోగ్రఫీ గురించి పోప్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘శృంగారం ఎంతో ఉన్నతమైంది… కానీ అది చివరికి అశ్లీలతతో అణగదొక్కబడుతోంది.. మనం ప్రేమను కాపాడుకోవాలి. భోగాల పోరులో జీవితాంతం గెలవలేం.  పోర్న్ క్రూరమైన ప్రవర్తనలకు దారితీస్తుంది. కామం ప్రమాదకరమై పరిణామాలకు దారితీస్తుంది’ అని పోప్ హెచ్చరించారు.
 
‘కామం దోచుకుంటుంది. దహించేస్తుంది. అది మరొకరి మాట వినడానికి ఇష్టపడదు. కానీ దాని అవసరం ఆనందం కోసం మాత్రమే. అది హేతువు. మన ఉనికిని తెలివిగా నిర్వహించడానికి సహాయపడుతుంది’ అని పోప్ వ్యాఖ్యలు చేసినట్టు ది టెలిగ్రాఫ్ పేర్కొంది. పోర్న్ ముప్పు గురించి పోప్ మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు. అక్టోబర్ 2022లోనూ ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. 
 
దేవుడు మనిషికి ఇచ్చిన అందమైన వస్తువులో శృంగారం ఒకటి అని ఆయన వ్యాఖ్యానించారు. హస్త ప్రయోగం గురించి ప్రస్తావిస్తూ ‘మిమ్మల్ని మీరు లైంగికంగా వ్యక్తీకరించడం గొప్పదనం. కాబట్టి నిజమైన లైంగిక వ్యక్తీకరణను దూరం చేసే ఏదైనా మిమ్మల్ని ఈ గొప్పతనాన్ని తగ్గిస్తుంది’ అని స్పష్టం చేశారు.
 
మత ప్రబోధకులు, క్రైస్తవ సన్యాసినులు పోర్న్ చూసే విషయం తనకు తెలుసని, ఫోన్‌ల నుంచి వాటిని తొలంగించాలని పోప్ సలహా ఇచ్చారు. ‘మీలో ప్రతి ఒక్కరూ డిజిటల్ పోర్నోగ్రఫీ అనుభవం లేదా ఉద్రేకత ఉన్నారా? అని ఆలోచిస్తారు. ఇది చాలా మందికి ఉన్న దుర్మార్గమైన అలవాటు. వీరిలో సామాన్యులు, స్త్రీలు, సన్యాసినులు కూడా ఉన్నారు’ అని పోప్ ఫ్రాన్సిస్ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
‘నేను కేవలం పిల్లల దుర్వినియోగం వంటి క్రిమినల్ పోర్నగ్రపీ గురించి మాట్లాడటం లేదు. మీరు ప్రత్యక్షంగా దుర్వినియోగ కేసులను చూస్తాం. ఇది ఇప్పటికే చాలా ప్రమాదకరం’ అని పేర్కొన్నారు. సాధారణ చర్చి ఆచారాలు లేదా ప్రార్ధనలలో భాగం కానంత వరకు స్వలింగ జంటలను ఆశీర్వదించడానికి పూజారులను అనుమతించడాన్ని గతేడాది అధికారికంగా ఆమోదించారు. 
 
కొత్త నిబంధనలను అమలు చేయడానికి నిరాకరించిన కొంతమంది విమర్శలపై స్పందిస్త కాథలిక్ చర్చిలో దానిని ప్రతిఘటించిన వారు అవగామన చేసుకోలేకపోయారని చెప్పారు.