ఏపీలో మూడు రైలు సర్వీసుల పొడిగింపు

దక్షిణ మధ్య రైల్వే ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతానికి సంబంధించిన వివిధ గమ్యస్థానాలకు అదనపు ప్రయాణ సౌకర్యాన్ని అందించడానికి, విస్తరించిన ప్రాంతంలోని ప్రజల అవసరాలను తీర్చడానికి మూడు జతల రైలు సేవలను విస్తరించింది. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి గుంటూరు రైల్వే స్టేషన్‌ లో  శుక్రవారం జరిగే కార్యక్రమంలో పొడిగించిన ఈ రైలు సర్విస్ లకు  జెండా ఊపి ప్రారంభిస్తారు.
 
అదే సమయంలో రేణిగుంట, నర్సాపూర్ రైల్వే స్టేషన్‌లలో కూడా సంబంధిత డివిజనల్ రైల్వే అధికారుల సమక్షంలో ఫ్లాగ్‌ఆఫ్ కార్యక్రమాన్ని వీక్షించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రారంభ ప్రత్యేక రైలు సర్వీసుల్లో రైలు నం. 02701 గుంటూరు – విజయవాడ; రైలు నెం. 07225 నర్సాపూర్ – విజయవాడ ఎక్స్‌ప్రెస్ మరియు రైలు నెం. 07295 రేణిగుంట – కడప స్పెషల్ ఉన్నాయి.
 

హుబ్బల్లి – నర్సాపూర్, విశాఖపట్టణం – గుంటూరు, నంద్యాల – రేణిగుంట మధ్య ఈ కొత్త రైళ్లు సేవలు అందిస్తాయి. నర్సాపూర్- హుబ్బల్లి మధ్యన నడవనున్న 17225/17226 రైలు విజయవాడ – నర్సాపూర్ మధ్య  ఉన్న గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, భీమవరం, పాలకొల్లు స్టేషన్లలో ఆగనుంది.

నంద్యాల – రేణిగుంట మధ్యన నడవనున్న 07285/07284 రైలు కడప – రేణిగుంట మధ్యన ఉన్న ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, ఓబులవారిపల్లి, కోడూరు, బాలపల్లె స్టేషన్లలో ఆగనుంది. విశాఖపట్టణం – గుంటూరు మధ్యన 22701/22702 రైలు నడవనుంది.  వీటిల్లో విశాఖపట్టణం – గుంటూరు రైలును నేరుగా ప్రారంభించనుండగా, హుబ్బల్లి – నర్సాపూర్, నంద్యాల – రేణిగుంట రైళ్లను వర్చువల్ గా వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభింభిస్తారు.