
వీటిని దాదాపు 10 నెలలుగా విచారిస్తోంది సుప్రీంకోర్టు. ఈ నేపథ్యంలో అదానీ కేసుపై సెబీ చేపడుతున్న దర్యాప్తును సిట్కు బదిలీ చేయాలని దాఖలైన పిటీషన్లపై బుధవారం కీలక తీర్పును వెలువరించింది అత్యున్నత న్యాయస్థానం.
“22 అంశాల్లోని 20 వాటిపై సెబీ దర్యాప్తును పూర్తి చేసింది. మిగిలిన రండు అంశాల దర్యాప్తును మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశిస్తున్నాము. అసాధారణమైన పరిస్థితుల్లోనే కేసు దర్యాప్తును బదిలీ చేయడంపై ఆలోచించాలి. న్యూస్ పేపర్లలో వస్తున్న వార్తలను పట్టించుకుని సెబీ దర్యాప్తును సందేహించలేము. వార్తలను ఇన్పుట్స్లా పరిగణించవచ్చు కానీ దర్యాప్తు సరిగ్గా జరగడం లేదనేందుకు అవి ఆధారాలు అవ్వలేవు,” అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.
అయితే భారత మదుపర్లకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఏవైనా చర్యలు తీసుకోవాల్సి వస్తే.. వాటిని కచ్చితంగా అమలు చేసేందుకు కృషిచేయాలని సెబీ, ప్రభుత్వానికి సూచించింది సుప్రీంకోర్టు.
సుప్రీంకోర్టు తీర్పుపై గౌతమ్ అదానీ నిజం గెలిచిందంటూ ట్వీట్ చేశారు. “నిజం గెలిచింది. సత్యమేవజయతే! సుప్రీంకోర్టు తీర్పు ఇందుకు నిదర్శనం. ఈ విషయంలో మాకు తోడుగా నిలబడిన వారికి ధన్యవాదాలు. దేశాభివృద్ధికి మేము చేస్తున్న కృషి కొనసాగుతుంది. జై హింద్!” అని ట్వీట్ చేశారు గౌతమ్ అదానీ.
More Stories
ట్రంప్ టారిఫ్లను నిలిపివేయాలని కోర్టుకు 12 రాష్ట్రాలు
అమెజాన్, వాల్మార్ట్లపై ఆంక్షలు తొలగింపుకై వత్తిడి
జులైలో పట్టాలపైకి దేశంలో తొలి హైడ్రోజన్ రైలు