2019 ఎన్నికల్లో లోకేశ్ పై పోటీ చేసి గెలిచానని గుర్తు చేస్తూ మంగళగిరి అభివృద్ధి కోసమే తనను ప్రజలు గెలిపించారని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రూ.1200 కోట్లు కేటాయించారని, ఆ నిధులను ఖర్చు చేసేందుకు డీపీఆర్ లు సిద్ధం చేశారని, అయితే వాటిని క్రమంగా రూ. 125 కోట్లకు కుదిస్తూ వచ్చారని రామకృష్ణారెడ్డి విస్మయం వ్యక్తం చేశారు.
కేవలం రూ. 125 కోట్లు మాత్రమే ఇస్తూ జీవో ఇచ్చారని, ఇందుకు సంబంధించిన పనులు పూర్తి అయ్యాయని, అయితే ఆ నిధులను కూడా విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంలో ధనుంజయ రెడ్డితో చాలా సార్లు మాట్లాడినప్పటికీ డబ్బులు విడుదల కాలేదని చెప్పారు.
కాంట్రాక్టర్ల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో స్వయంగా తానే అప్పులు తీసుకొచ్చి కొన్ని ఇచ్చానని తెలిపారు. దుగ్గిరాల విషయంలో నిధులు కేటాయించలేదంటూ ఇలాంటి పరిస్థితుల్లో తాను ఏం చేయాలి? మరోసారి గెలవాలంటే సంక్షేమమే కాదు అభివృద్ధి చేయకుండా మంగళగిరి ప్రజలను ఏమని ఓట్లు అడగాలి? అని ప్రశ్నించారు. అందుకే ఎవర్నీ నిందించకుండా పక్కకు జరిగానని, ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీకి కూడా రాజీనామా చేశానని ఆర్కే చెప్పుకొచ్చారు.
మరోవంక, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై వేసిన కేసులపై న్యాయ పోరాటం చేస్తానని తేల్చి చెప్పారు ఆర్కే. రేవంత్ కాంగ్రెస్‌లో ఉన్నా.. షర్మిల కాంగ్రెస్‌కు వచ్చినా తన పోరాటం ఆగదని కూడా తెలిపారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి స్వయంగా ఉన్నారని పేర్కొంటూ ప్రస్తుతం సీఎం అయితే రేవంత్ రెడ్డి ఏమైనా గొప్పా? అని ప్రశ్నించారు. తప్పు ఎవ్వరూ చేసినా తప్పే అని పేర్కొంటూ వైసీపీ సర్కార్ తప్పు చేస్తే వాటిపై కూడా కేసులు వేసేందుకు అయినా వెనకాడనని స్పష్టం చేశారు.
More Stories
అయోధ్య రామయ్యకు టిటిడి పట్టువస్త్రాలు
గిరిజనులు వ్యాపార రంగంలోకి రావాలి
ఏపీలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులు