యూట్యూబ్‌లో ప్ర‌ధాని మోదీ రికార్డు

సోషల్ మీడియాలోని పలు వేదికలపై ప్రధాని నరేంద్ర మోదీ చాలా క్రియాశీలంగా ఉంటారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా తన ఆలోచనలను పంచుకుంటూ ఉంటారు. వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ప్రధాని మోదీకి కోట్ల సంఖ్యలో ఫాలోవర్లు కూడా ఉన్నారు.  ఆయ‌న యూట్యూబ్ ఛాన‌ల్‌లో స‌బ్‌స్క్రైబ‌ర్ల సంఖ్య‌ రెండు కోట్లు దాటింది. 
ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న దేశాధినేత‌లు అత్య‌ధిక సంఖ్య‌లో మోదీకి యూట్యూబ్ ఖాతాదారులుగా ఉన్నారు. ప్ర‌భుత్వ యూట్యూబ్ ఛాన‌ల్‌లో ప్ర‌ధాని త‌న వీడియోల‌ను పోస్టు చేస్తుంటారు.  ఆ వీడియోల‌ను సుమారు 450 కోట్ల మంది ఇప్ప‌టికే వీక్షించారు. ప్ర‌పంచ రాజకీయ నేత‌ల్లో ఎవ‌రు కూడా ఆయ‌న ద‌రిదాపుల్లోలేరు.  ప్రపంచ రాజకీయ నాయకులకు సంబంధించి యూట్యూబ్ చానెళ్లలో అత్యధిక సంఖ్యలో, అంటే, 2 కోట్లకు మించి ఫాలోవర్లు ఉన్న నాయకుడు మోదీ మాత్రమే. 
 
రెండో స్థానంలో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సనోరా ఉన్నారు. ఆయన సబ్ స్క్రైబర్ల సంఖ్య 64 లక్షలు మాత్రమే. అంటే, రెండో స్థానంలో ఉన్న జైర్ బోల్సనోరా ప్రధాని మోదీ కన్నా చాలా దూరంలో ఉన్న విషయం అర్థమవుతుంది.
ప్రపంచ నాయకులలో అత్యధిక యూట్యూబ్ సబ్ స్క్రైబర్లు () పొందిన మూడవ యూట్యూబ్ ఛానెల్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ది. ఆయన చానల్ కు 11 లక్షల మంది ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. ఈ జాబితాలో నాలుగో స్థానంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉన్నారు. ఆయన యూట్యూబ్ ఛానెల్ కు 7,94,000 మంది సబ్స్క్రైబర్లు మాత్రమే ఉన్నారు.

ట‌ర్కీ అధ్య‌క్షుడు రిసెప్ త‌యిప్ ఎర్డగోన్‌కు 3.16 ల‌క్ష‌ల స‌బ్‌స్క్రైబ‌ర్లు ఉన్నారు. యోగా విత్ మోదీ అన్న యూట్యూబ్ ఛాన‌ల్‌లో కూడా మోదీకి ఫుల్ క్రేజీ ఉంది. ఆ ఛాన‌ల్‌లో ఆయ‌న‌కు 73 వేల మంది స‌బ్‌స్క్రైబ‌ర్లు ఉన్నారు. రాహుల్ గాంధీ ఛాన‌ల్‌కు 35 ల‌క్ష‌ల మంది స‌బ్‌స్క్రైబ‌ర్లు ఉన్నారు. ప్ర‌ధాని మోదీ త‌న యూట్యూబ్ ఛాన‌ల్‌ను గుజ‌రాత్ ముఖ్యమంత్రిగా ఉన్న‌ప్పుడు 2007లో ఏర్పాటు చేశారు. అప్ప‌టి నుంచి సోష‌ల్ మీడియాలో ఆయ‌న పాపులారిటీ త‌గ్గ‌లేదు.

అంతేకాకుండా, వ్యూస్ విషయానికి వస్తే, 2023 డిసెంబర్లో 2.24 బిలియన్ వ్యూస్ ను నమోదు చేస్తూ మోదీ ఛానల్ ఆధిపత్యం కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వ్యూస్ సాధించిన రెండో స్థానంలో ఉన్న జెలెన్స్కీ కంటే ఇది 43 రెట్లు అధికం. డిజిటల్ ల్యాండ్ స్కేప్ లో ప్రధాని మోదీ ఉన్న అసమాన ఫాలోయింగ్ కు ఈ గణాంకాలు రుజువులుగా నిలుస్తాయి.