మాజీ సైనికుడిపై దాడి చేసిన పాస్టర్

ఖమ్మంలొ ధారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక క్రైస్తవ పాస్టర్ మరో 30 మందితో కలిసి దాసరి శ్రీకాంత్ అనే మాజీ సైనికుడిపై దాడి చేసి తీవ్రంగా  గాయపరచడం జరిగింది. శ్రీకాంత్ భార్యని కూడా మతం మార్చి అతని కుటుంభంలో చిచ్చు పెట్టి, అతనిని కూడా కూడా మతం మారాలని ఒత్తిడి తీసుకు వచ్చాడు. 
 
అదే క్రమంలో ఇతని ఇంటి ఎదురుగా ఉన్న మరొక ఇంట్లో సెమీ క్రిస్మస్ వేడుకల పేరుతో హిందూ దేవి దేవతలను సైతాన్లు అంటూ తిడుతుంటే దాన్ని సహించలేని శ్రీకాంత్ వాళ్ళని ప్రశ్నించాడు. దాంతో సుమారుగా 30 మంది శ్రీకాంత్ పై దాడి చేసి తీవ్రంగా కొట్టడం జరిగింది.
దారుణం ఏంటి అంటే అతను భార్య కూడా భర్తను తప్పుబడుతూ పాస్టర్ కు మద్దతు పలికే విధంగా వారు చేశారు. ఆ విధంగా మతం మారిన కుటుంబాలలో చాలామంది ఎస్సీ ఉపకార వేతనాలు పొందుతూ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉండడంతో దానిని ప్రవీణ్ బలంగా ప్రశ్నించాడు. 
 
“మీరు మతం మారారు కాబట్టి మీరు రిజర్వేషన్ కు అనర్హులు. మీరు మీ రిజర్వేషన్ వదులుకోవాల్సిందే” అని స్పష్టం చేస్తుండడంతో వారంతా కలిసి ఆగ్రహంతో శ్రీకాంత్ పై  దాడి చేసినట్లు తెలుస్తుంది..  శ్రీకాంత్ నానా రిటైర్డ్ పోలీస్ అధికారి. తమను కూడా మతం మారమని తీవ్రమైన వత్తిడికి గురిచేస్తున్నట్లు అతని తల్లి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నది.