
మొన్నటిదాకా చెన్నై నగరాన్ని అతలాకుతలం చేసిన వర్షాలు ఇప్పుడు దక్షిణ తమిళనాడును ముంచెత్తుతున్నాయి. తిరునెల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి, తెన్‌కాసి, విరుద్‌నగర్ జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణ శాఖ నాలుగు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది.
ఆదివారం అర్థరాత్రి దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు కురిశాయి.
ప్రస్తుతం కొమోరిన్, దాని పరిసర ప్రాంతాలపై తుపాను ప్రభావం ఉందని, ఇది మధ్య-ట్రోపోస్పిరిక్ స్థాయిల వరకు విస్తరించి ఉందని ఐఎండీ అదికారులు తెలిపారు. నాలుగు జిల్లాల్లో ఆదివారం భారీ వర్షం కురవడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రతికూల వాతావరణం కారణంగా సోమవారం అన్ని విద్యాసంస్థలు బంద్ అయ్యాయి.
వరదనీరు రైలు యార్డుల్లోకి ప్రవేశించాయి. రైలు పట్టాలపైకి వరదనీరు ప్రవేశించడంతో పలు రైళ్లు పూర్తిగా రద్దు చేశారు. టుటికోరిన్ జిల్లాలోని తిరుచెందూర్‌లో సోమవారం తెల్లవారుజామున 1:30 గంటల వరకు 606 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టడానికి నాలుగు ప్రభావిత జిల్లాలకు మంత్రులను పంపింది. నాలుగు జిల్లాల్లో సహాయక చర్యలను వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నలుగురు సీనియర్ ఐఎఎస్ అధికారులను కూడా నియమించింది.
సోమవారం తెల్లవారుజామున కూడా భారీవర్షాలు కొనసాగాయి. దీంతో పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కోవిల్‌పట్టి చుట్టుపక్కల ఉన్న నదులు, సరస్సులు పూర్తి నిండుకున్నాయి, దీంతో నదులు, సరస్సులు పొంగిపొర్లుతున్నాయి.
తిరుచెండూరులో అర్ధరాత్రి 1.30 గంటల వరకు 60 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. అదేవిధంగా తిరునల్వేలి జిల్లాలోని పాలయంకొట్టయ్‌లో 26 సెంటీమీటర్లు, కన్యాకుమారిలో 17.3 సెంటీమీటర్ల వర్షంపాతం నమోదయింది. కాగా, కన్యాకుమారి, తిరునెల్‌వెల్లి, తూత్తూకుడి, రామాంతపురం, పూడుకొట్టాయి, తంజావుర్ జిల్లాలోని ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
వర్షాల ప్రభావంతో రాష్ట్రంలో రైళ్లు, విమానాలు రద్దయ్యాయి. రైల్వే ట్రాకులపై నీరు నిల్వడంతో తిరునల్వేలికి రావాల్సిన, అక్కడి నుంచి వెళ్లాల్సిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌తోపాటు 17 రైళ్లను అధికారులు రద్దు చేశారు. అదేవిధంగా తూత్తుకూడి నుంచి రాకపోకలు సాగించే విమానాలను దారిమళ్లించడంతోపా పలు విమానాలను రద్దు చేశారు.
More Stories
48 స్థానాలతో బిజెపి విజయకేతనం
కుంభమేళాలో పాల్గొన్న పాక్ హిందువులు
జమ్ముకశ్మీర్‌లో 12 మంది పాక్ చొరబాటుదారులు కాల్చివేత