
సోమవారం ఉదయం 9 గంటలకే హోటల్ వద్దకు చేరుకున్న నాదెండ్ల మనోహర్ ను కనీసం రూమ్ నుంచి బయటకు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారని జనసేన నేతలు ఆరోపించారు. మనోహర్ పాటు పార్టీ నాయకులను బయటకు వెళ్లనీయకుండా హోటల్ గేట్లు వేసి పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుతంగా, ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా ఫుట్ పాత్ మీద అయినా ప్రజా సమస్యపై నిరసన తెలుపుతామని మనోహర్ అసిస్టెంట్ కమిషనర్ కు వివరించినా పోలీసులు అందుకు అంగీకరించలేదని జనసేన నేతలు తెలిపారు. దానితో మనోహర్ హోటల్ వద్ద నిరసన తెలిపారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదని వైసీపీ ప్రభుత్వం ఆంక్షలు విధించడం అత్యంత దారుణం అంటూ మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం వ్యవస్థలను ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా ఉపయోగించుకుంటుందో అర్థమవుతుందని మండిపడ్డారు. విశాఖలోని లక్షలాది మందికి ఎంతో అవసరమైన కూడలిని మూసివేసి, రెండు కిలోమీటర్ల దూరం పెంచి చుట్టూ తిరిగి రావాలనేలా ప్రజల సమయంతో ప్రభుత్వ పెద్దలు ఆటలాడుతున్నారని విమర్శించారు.
విశాఖలోని టైకూన్ జంక్షన్ ను మూసివేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంటే నిరసన తెలిపి, ఆ కూడలిని తెరవాలని కోరినందుకు నాదెండ్ల మనోహర్ ను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాదెండ్ల మనోహర్ ను, జనసేన నేతలను తక్షణమే విడుదల చేయాలని పవన్ డిమాండ్ చేశారు. ఇదే ధోరణిలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తే విశాఖపట్నం బయలుదేరి వస్తానని, ప్రజల తరఫున పోరాడతానని హెచ్చరించారు.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు