మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా మోహన్‌ యాదవ్‌

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎంపికలో బీజేపీ నాయకత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేసులో ఉన్న సీనియర్‌ నాయకులు అందరినీ పక్కన పెట్ అసలు రేసులోనే లేని మోహన్‌యాదవ్‌కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం మధ్యప్రదేశ్‌ బీజేపీ శాసనసభా పక్షం సమావేశమై తమ నాయకుడిగా మోహన్‌ యాదవ్‌ను ఎన్నుకున్నది.

జగ్దీస్ఘ్ దేవదా, రాజేష్ శుక్లా ఉపముఖ్యమంత్రులుగా వ్యవహరిస్తారు. రాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించి కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలిగిన నరేంద్ర తోమర్ అసెంబ్లీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.  “నేను పార్టీలో చిన్న కార్యకర్తను. మీ అందరికీ, రాష్ట్ర నాయకత్వానికి,  కేంద్ర నాయకత్వానికి ధన్యవాదాలు. మీ ప్రేమ, మద్దతుతో, నేను నా బాధ్యతలను నెరవేర్చడానికి ప్రయత్నిస్తాను,” అంటూ ముఖ్యమంత్రిగా తనను ఎన్నుకోవడం పట్ల యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.

 యాదవ్ మూడుసార్లు ఉజ్జయిని దక్షిణ్ నుండి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. మొదటిసారి 2013లో ఎమ్యెల్యేగా ఎన్నికైన ఆయన జూలై 2020లో అప్పటి శివరాజ్ సింగ్ చౌహన్ క్యాబినెట్‌లో మంత్రిగా ప్రమాణం చేశారు. 

కాగా, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎంపిక కోసం అంతకుముందు బీజేపీ హైకమాండ్‌ హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్‌ ఖట్టర్‌, తెలంగాణకు చెందిన ఎంపీ డాక్టర్‌ కే లక్ష్మణ్‌, ఆశా లక్రాలతో కేంద్ర పరిశీలకులుగా నియమించింది. ఈ పరిశీల సమక్షంలోనే కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు తమ నాయకుడిగా మోహన్‌యాదవ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.