కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జన్మదిన వేడుకలను హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. సోనియా గాంధీ జన్మదినం రోజున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రకటన జరిగిందని.. ఈరోజు ఎంతో చారిత్రాత్మకమైందన్నారు. ప్రత్యేక రాష్ట్ర వచ్చిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలు ఆత్మగౌరవంతో తలెత్తుకొని ప్రజలు సంతృప్తిగా జీవించడానికి.. దశాబ్ద కాలం వేచి చూడాల్సి వచ్చిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను భారీ మెజార్టీతో గెలిపించి సోనియా గాంధీకి ప్రభుత్వ ఏర్పాటును తెలంగాణ ప్రజలు కానుకగా ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను, మ్యానిఫెస్టోలో పేర్కొన్న ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు కాంగ్రెస్ 6 గ్యారెంటీల్లో సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా మహాలక్ష్మి పథకం నేటి నుంచి అమలు కానున్న సంగతి తెలిసిందే.

More Stories
విజయోత్సవాలు జరుపుకొనేందుకు కాంగ్రెస్ సిగ్గుపడాలి
బిజెపి మహాధర్నా పోస్టర్ విడుదల
వైఫల్యాలు దాచిపెట్టేందుకే రేవంత్ `రైసింగ్ తెలంగాణ’ సదస్సు