సమాజంలో దోపిడీకి, అన్యాయాలకు బలైపోతున్న అట్టడుగువర్గాల సంక్షేమం కోసం అంబేద్కర్ తన జీవితాన్ని అంకితం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బుధవారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. రాజ్యాంగ రూపశిల్పియే కాకుండా సామాజిక సామరస్యానికి అజరామరమైన ఛాంపియన్గా నిలిచారని కొనియాడారు. దళిత కుటుంబం నుంచి వచ్చి భారత రాజకీయాల్లో అత్యంత ప్రధాన నాయకునిగా ఎదిగారని ప్రధాని తెలిపారు.
1956 లో కన్నుమూసినప్పటికీ ఆయన భావజాలం, ఆలోచనలకు దక్కిన గుర్తింపు ఏళ్లకొలది పెరుగుతూనే ఉందని చెప్పారు. ముఖ్యంగా దళిత నేపథ్యం , షెడ్యూల్డ్ కులాల్లో ఆధారమై ఓటింగ్ సరళిని ప్రభావితం చేస్తోందని వివరించారు. అలాగే ఆయన స్ఫూరి ఇతర బలహానవర్గాలు విద్యారంగంలోనూ రాజ్యాంగపరమైన ఆందోళనలకు, ఏకీకరణకు ఊతం కలిగిస్తోందని ప్రధాని ఉదహరించారు.

More Stories
`బాబ్రీ మసీద్’కు భూమి పూజ నిప్పుతో చెలగాటం.. బిజెపి
లుధియానాలో అక్రమ బంగ్లాదేశీయులపై పోస్ట్ కు అరెస్ట్!
గంగ, ఓల్గా నదుల స్ఫూర్తి భారత్- రష్యాలకు మార్గనిర్ధేశం