చైనా కంపెనీ వివోపై ఛార్జిషీట్‌ దాఖలు చేసిన ఈడీ

మనీలాండరింగ్‌ వ్యవహారంలో చైనాకు చెందిన ప్రముఖ సెల్‌ఫోన్ల తయారీ కంపెనీ వివోపై చార్జిషీట్ దాఖలు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  తెలిపింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ లోని క్రిమినల్ సెక్షన్ల కింద ఈడీ చార్జిషీట్‌లో అభియోగాలను మోపింది.  కంపెనీ 2014-2021 మధ్య దేశం నుంచి రూ.లక్ష కోట్లను దేశం నుంచి తరలించేందుకు షెల్‌ కంపెనీలను ఉపయోగించినట్లు ఆరోపించింది.
ఈ కేసులో లావా ఇంటర్నేషనల్ కంపెనీ ఎండీ హరి ఓం రాయ్, చైనా నేషనలిస్ట్‌ గ్వాంగ్వెన్ అలియాస్ ఆండ్రూ కువాంగ్, చార్టర్డ్ అకౌంటెంట్స్‌ను నితిన్ గార్గ్, రాజన్ మాలిక్‌లను అక్టోబర్‌లో ఈడీ అరెస్ట్ చేసింది.  కేసును 2022 కేసు దర్యాప్తును ప్రారంభించిన ఈడీ చైనా జాతీయులు, అనేక భారతీయ కంపెనీలతో కూడిన పెద్ద మనీలాండరింగ్ రాకెట్‌ను ఛేదించినట్లు పేర్కొంది. గతేడాది జులైలో వివో ఇండియాతో పాటు సంబంధిత వ్యక్తుల నివాసాలు, కార్యాలయాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే. 
 
ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో భారత్‌ నుంచి భారీ మొత్తంలో చైనీస్ ఫోన్ల కంపెనీ 2014లో భారత్‌లో పలు నగరాల్లో 19 కంపెనీలను ఏర్పాటు చేసిందని, ఆయా కంపెనీలకు చైనా జాతీయులు డైరెక్టర్లు లేదంటే వాటాదార్లుగా ఉన్నారని పేర్కొంది. వీవో 2014 నుంచి 2018 వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపించింది.
 
బౌద్ డిస్టిల్ల‌రీస్ పై ఐటి సోదాలు
 
మరోవంక, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఉన్న బౌద్ డిస్టిల్ల‌రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై ఆదాయ‌ప‌న్ను శాఖ త‌నిఖీలు చేసింది. బోలంగీర్, సంబల్‌పూర్, ఝార్ఖండ్‌లోని రాంచీ, లోహర్‌దగా ప్రాంతాల్లోని మద్యం తయారీ కంపెనీల్లో బుధవారం ఆదాయపన్నుశాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. మద్యం కంపెనీకి చెందిన కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు జరిపారు.
ఈ క్రమంలోనే బీరువాలో దాచిన కోట్ల రూపాయల నగదు చూసి అధికారులు షాక్ తిన్నారు. వీటిని లెక్కపెట్టే ప్రక్రియను మొదలెట్టారు. క్యాష్ కౌంటింగ్ మెషీన్లతో వీటిని లెక్కపెట్టే ప్రక్రియను ప్రారంభించగా.. అవి కాసేపటికే మొరాయించాయి. బుధవారం సాయంత్రం వరకూ 50 కోట్ల నగదును లెక్కపెట్టామన్న ఐటీ అధికారులు.. ఆ తర్వాత మెషీన్లు పనిచేయడం ఆగిపోయినట్లు తెలిపారు. గురువారం మిగతా ప్రక్రియ పూర్తిచేస్తామని వెల్లడించారు.రెండు రోజుల్లో సుమారు 150 కోట్ల రూపాయల నగదును ఐటీ శాఖ సీజ్ చేసినట్లు తెలిసింది.
మరోవైపు మద్యం తయారీ కంపెనీలతో పాటుగా వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలపైకూడా ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు జరిపినట్లు సమాచారం. బౌధ్ పురునా కటక్‌ వ్యాపారి అశోక్ కుమార్ అగర్వాల్‌కు చెందిన రైస్ మిల్లు, ఇళ్లపై ఐటీ బృందం సోదాలుచేసింది సంజయ్ సాహు, దీపక్ సాహు అనే మద్యం వ్యాపారుల ఇళ్లపైనా సోదాలు జరిగినట్లు తెలిసింది.