అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం తోక కట్ చేసిన ముస్లిం సమాజం

అసెంబ్లీ ఎన్నికల్లో  ఎంఐఎం తోక కట్ చేసిన ముస్లిం సమాజం

పాతబస్తీ అంటే మజ్లీస్, ఎంఐఎం అంటే ఓల్డ్ సిటీ. అంతగా పాతుకుపోయారు.. దారుస్సలాం లీడర్లు. మొత్తం 8 స్థానాల్లో వారిదే హవా. కానీ ఈసారి తెలంగాణ ఎన్నికల్లో మజ్లీస్ కోటకు బీటలు పడ్డట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పాతబస్తీ నుంచి ఈ సారి 7 స్థానాల్లోనే బరిలోకి దిగింది ఎంఐఎం. అయితే ఈ ఏడింట్లో కూడా మజ్లీస్ క్యాండిడేట్లు కిందా మీదా పడుతున్నారు. నాంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ స్ఫష్టమైన ఆధిక్యత చూపిస్తుండగా.. యాకత్ పురా, కార్వాన్ లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇటు గోషామహల్ లో ఓటమి తప్పదన్న అంచనాకు వచ్చిన మజ్లీస్.. అక్కడి నుంచి తప్పుకుంది. రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్ లో కూడా అభ్యర్థులను నిలబెట్టినా.. అక్కడ కూడా ప్రభావం తక్కువగానే కనిపిస్తోంది. అయితే ఎంఐఎం తొలి విజయాన్ని అందుకుంది. చార్మినార్ నుంచి జుల్పికర్ అలీ విన్ అయ్యారు.