గణనాధునిపై అసభ్య పోస్టు.. ముస్లింకు 3 ఏళ్ళ జైలు

మనదేశంలో హిందూ దేవతలు, దేవుళ్లను ఎవరైనా విమర్శించవచ్చా..? ఎలాంటి పదజాలం ఉపయోగించైనా మాట్లాడవచ్చా..? అలాంటి వారిని ఎవ్వరూ ఏం చేయలేరా..? తర్వాత సారీ చెప్పేస్తే సరిపోతుందా..? గొప్ప గొప్ప చట్టాలు ఉంటాయి కానీ.. ప్రభుత్వాలు పట్టించుకోవు. ఎక్కడివరకో ఎందుకు.. మన హైదరాబాద్ పాతబస్తీకి చెందిన మజ్లీస్ లీడర్.. హిందూ దేవుళ్ళను ఎన్ని మాటలు అన్నాడో ఇంకా మర్చిపోలేం. కానీ అతడికి ఎలాంటి శిక్ష లేదు. తాజాగా గుజరాత్ లో మాత్రం.. వినాయకుడిని అవమానిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ముస్లిం యువకుడికి  మూడేళ్ల జైలుశిక్ష పడింది. హిందూ దేవుళ్లను అవమానించిన వారికి శిక్ష పడటం ఇదే తొలిసారని చెబుతున్నారు.
2018 లో వినాయక చవితి సందర్భంగా.. గుజరాత్ లోని వల్సారీకి చెందిన ఆజాద్ రియాజుద్దీన్ అన్సారీ.. ఫేస్ బుక్ ఓ పోస్ట్ పెట్టాడు. గణనాధుని ఫోటోను ఎడిట్ చేసి.. అవమానకర రీతిలో కించపర్చే వ్యాఖ్యలు చేశాడు. దీనిపై స్థానిక హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. మరుసటి రోజు అతడిపై పోలీసులకు కంప్లైంట్ చేశారు. పలు సెక్షన్ల కింద అన్సారీపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఐదేళ్ల క్రితం నమోదైన ఈ కేసులో విచారణ చేపట్టిన వల్సాద్ లోని అదనపు జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు అన్సారీని దోషిగా తేల్చింది. అతడికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు.. 50 వేలు జరిమానా విధించింది.
ఈ కేసు తీర్పు.. హిందువులకు ఓ ఓదార్పులా అయ్యింది. భారత్ లోని ఉన్నప్పుడు హిందూ విశ్వాసాలను గౌరవించండి.. లేకపోతే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందనే సంకేతాలు ఇచ్చినట్లైంది. హిందువుల మనోభావాలతో పాటు.. మతాన్ని గౌరవించేలా ఈ తీర్పు ఉందని.. పలువురు అభిప్రాయపడుతున్నారు.