కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య బీమాపథకం అయిన ప్రధానమంత్రి ఆరోగ్య యోజన ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల పేరులో మార్పు చోటు చేసుకుంది. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను ‘ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్’గా మార్చాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
ఈ మేరకు కేంద్రం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసినట్లు అధికార వర్గాలు ఆదివారం తెలియజేశాయి. ఆరోగ్య కేంద్రాలకు పేరు మార్చిన తర్వాత ఆ ఫొటోలను ‘ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్’ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని సూచించింది.
అలాగే పేరు మార్చిన హెల్త్ సెంటర్లకు ‘ఆరోగ్యం పరమం ధనమ్’ అనే కొత్త ట్యాగ్‌లైన్ కూడా ఉంటుంది. జాతీయ ఆరోగ్య విధానంలో భాగంగా 2018సెప్టెంబర్‌లో కేంద్రప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకం.
ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల వరకు వైద్యం అందించేందుకు ఈ పథకం ఉద్దేశించింది. దేశంలోని 50 కోట్ల మందికి 1393 రకాలయిన వ్యాధులకు చికిత్స అందించడానికి ఈ పథకం అవకాశం కల్పించింది.

More Stories
మహారాష్ట్రలో పెను విషాదం సృష్టిస్తున్న కుండపోత వర్షాలు
మణిపూర్‌లో సైనిక కాన్యాయ్‌ను ఐఈడీతో పేల్చివేత.. ఇద్దరు జవాన్లు మృతి
పండ్ల తోటలోని ఇద్దరు ఉగ్రవాదులను చుట్టుముట్టిన భద్రతా దళాలు