కేసీఆర్, కేటీఆర్ జైలుకెళ్లటం ఖాయం

తెలంగాణాలో తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ముఖ్య‌మంత్రి కెసిఆర్, కేటీఆర్ లు చేసిన అవినీతి అక్ర‌మాల‌పై విచార‌ణ జ‌రిపి జైలుకు పంపిస్తామ‌ని చెప్పారు కేంద్ర మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అలాగే తెలంగాణ‌లో కెసిఆర్ ప్ర‌భుత్వం క‌ల్పించిన ముస్లీంల రిజర్వేష‌న్ కోటాను ర‌ద్దు చేస్తామ‌ని ప్రకటించారు.
తెలంగాణాలో బీజేపీ ఎన్నికల ప్రచార సభలలో శుక్రవారం పాల్గొంటూ, హైదరాబాద్ లో పలు నియోజకవర్గాల్లో రోడ్ షో లలో కూడా పాల్గొన్నారు. 
అవినీతికి పాల్పడినా ఎవ్వరూ ఏమి చేయలేరని విర్రవీగుతున్న కేసీఆర్, కేటీఆర్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వంలో జైలుకు పంపిస్తామని చెప్పుకొచ్చారు.  తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని కేంద్ర హోంశాఖ హామీ ఇచ్చారు. పేరుకే కెసిఆర్ పాల‌న అని నిజానికి స్టీరింగ్ మజ్లీస్ చేతిలో ఉందని ఆరోపించారు.
 
ద‌నిక రాష్ట్రాంగా ఉన్న‌తెలంగాణ‌ల‌ను పదేళ్లలో విధ్వంసం చేశారని చెప్పారు. వ్య‌వ‌సాయ భూముల నుంచి ప్ర‌భుత్వా ఆస్తుల వ‌ర‌కూ బీఆర్ఎస్ నేతలు వదలడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్రోల్ పై కేంద్రం పన్ను తగ్గిస్తే కేసీఆర్ సర్కారు మాత్రం పట్టించుకోలేదన్నారు.  రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో రోడ్ షోలలో పాల్గొంటూ  రాజేంద్రనగర్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని అమిత్ షా ఆరోపించారు. రాజేంద్రనగర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారని గుర్తు చేశారు. 
 
ఎంఐఎం సాయంతోనే ఉగ్రవాదులు హైదరాబాద్‌లో తలదాచుకుంటున్నారని ఆరోపించారు. ఉగ్రవాదులను ఎన్ఐఏ అధికారులు పట్టుకునే వరకు ఇక్కడి పోలీసులు ఏం చేస్తున్నారంటూ అమిత్ షా ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు ఓవైసీ భయం పట్టుకుందని, అందువల్లే సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించడం లేదని అమిత్ షా ఆరోపించారు. 
 
కారు పార్టీ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందన్న అమిత్ షా.. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కార్ అని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఉగ్రవాదులను ఏరి పారేస్తామన్నారు.
 
బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామన్న ఏకైక పార్టీ బీజేపీనే అని చెబుతూ  బిజెపి పార్టీ గెలుపుతోనే సబ్బండ కులాల సంక్షేమం, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని భరోసా ఇచ్చారు. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణలో బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చాక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. 
 
ఉత్తర తెలంగాణ నుంచి బతుకుదెరువు కోసం బయట దేశం వెళ్లిన వారికి వారి కోసం సంక్షేమ శాఖ మంత్రిని ఏర్పాటు చేస్తామని అమిత్ షా ప్రకటించారు. బీడీ కార్మికుల కోసం జిల్లా కేంద్రంలో 500 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని, ఉజ్వల భవిష్యత్తు పథకం ద్వారా ప్రతి పేదింటికి నాలుగు గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తామని అమిత్‌షా పేర్కొన్నారు.
 
రైతులు పండించిన ప్రతి వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తుందని తెలిపారు. డిసెంబర్ 3 తర్వాత వరి ధాన్యం క్వింటాల్‌కు రూ. 3100 ధరతో కడుక్తా లేకుండా కొనుగోలు చేస్తామమని చెప్పారు. పసుపు పండించే రైతుల కోసం పసుపు బోర్డు, రీసర్చ్ సెంటర్‌ను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. 
 
భారత్, ఆస్ట్రేలియా ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ తిలకించేందుకు వెళ్లిన ప్రధాని మోదీని కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అమిత్ షా హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలు ఎప్పుడు ప్రధాని మోదీని కించపరిచే విధంగా మాట్లాడినా లేక దుర్భాషలాడినా ప్రజలు బీజేపీ ఓటు వేసి సమాధానం ఇస్తూ వస్తున్నారనిగుర్తు చేశారు.
 
ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే జరుగుతుందని హోమ్ మంత్రి స్పష్టం చేశారు. ఎన్నికలలో బీజేపీ మంచి ఫలితాలు సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు అమిత్ షా. ఫలితాల కోసం డిసెంబర్ 3వ తేది వరకు వేచిచూడాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు.  మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందనే విశ్వాసం ఉందని స్పష్టం చేయసారు.