ఏపీలో ఆధార్ అథెంటికేషన్ ద్వారా జీఎస్టీ తక్షణ రిజిస్ట్రేషన్

ఆంధ్రప్రదేశ్ లో జి ఎస్ టి తక్షణ రిజిస్ట్రేషన్ ను ఆధార్ అథెంటికేషన్ ద్వారా చేసుకునే అవకాశాన్ని అమలు చేస్తున్నట్టు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. తిరుపతిలోని ప్రసార భారతి సమీపంలో రూ.36.11కోట్ల వ్యయంతో ఆరు అంతస్తులతో నిర్మించనున్న తిరుపతి సీజీఎస్టీ కమిషనరేట్‌ కార్యాలయ భవన నిర్మాణానికి గురువారం జరిగిన భూమి పూజ కార్యక్రమంలో ఆమె ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో పాల్గొన్నారు.

ఈ నూతన భవనం నిర్మితం అయితే ఏడాదికి రూ. 63 లక్షలు ఆదా అవుతుందని తెలిపారు. తిరుపతి సిజీఎస్టీ కమిషనరేట్ పరిధిలో తిరుపతి, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్య సాయి, కడప అన్నమయ్య జిల్లాలు ఉన్నాయని, సుమారు 57,173 జీఎస్టీ పన్ను చెల్లింపుదారులు ఉన్నారని ఆమె వివరించారు. 

గత సంవత్సరం ఒక్క జీఎస్టీ టాక్స్ కలెక్షన్లలో రూ. 8264 కోట్లుగా ఉందని, ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ నాటికి రూ.5019 కోట్లు వసూళ్లు చేశారని, గత సంవత్సరాలను గమనిస్తే ఇది మూడు వందల శాతంగా వృద్ధి ఉందని ఆమె తెలిపారు. దీనికి ప్రధానంగా ఇక్కడ ఉన్న ప్యాసింజర్ వాహనాల తయారీ పరిశ్రమలు, ఆటోమోటివ్ బ్యాటరీ పరిశ్రమలు, సిమెంట్ పరిశ్రమలు ప్రధానంగా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయని తెలిపారు. 

శ్రీసిటీ పరిశ్రమల కాంట్రిబ్యూషన్ కూడా ఒక ముఖ్య కారణం అని ఆర్ధిక మంత్రి పేర్కొన్నారు. కేంద్ర జీఎస్టీ కౌన్సిల్ పైలట్ ప్రాజెక్ట్ కింద ఆంధ్రప్రదేశ్ కు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ఆధార్ అథెంటికేషన్ ద్వారా జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఇన్స్తెంట్ గా చేసుకునే వీలుగా ఒక పైలట్ ప్రాజెక్ట్ కేంద్రం నుండి మంజూరు అయిందని ఆమె తెలిపారు. 

ఇందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిటిజన్ సర్వీస్ సెంటర్ల ఏర్పాటు చేసుకోవాలని, ఆ సెంటర్లలో సూక్ష్మ మధ్య తరగతి పరిశ్రమలు, చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటున్న వారు వారి డాక్యుమెంట్లు సక్రమంగా ఉంటే ఇన్స్టెంట్ గా 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ చేసి సర్టిఫికేట్ పొందవచ్చునని సీతారామన్ చెప్పారు.

కేంద్ర రెవెన్యూ సెక్రెటరీ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ నిజాయితీగా పన్నులు చెల్లిస్తున్న వారికి అండగా ఉండాలని, పన్ను ఎగవేత చేసే వారిపట్ల కటినంగా ఉండాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో దొరికిన దోషులపై ఇన్వెస్టిగేషన్ వేగవంతం, ప్రాసిక్యూషన్ చేయాలని చెప్పారు.

సిబిఐసి చైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలు పరిశీలిస్తే 54 నూతన భవనాల ప్రతిపాదనలకు 2200 కోట్లు మంజూరు అయిందని, 9 ప్రతిపాదనలకు స్టాఫ్ క్వార్టర్స్, వాటి నవీకరణకు చెందినవి రూ. 640 కోట్లు మంజూరు జరిగిందనీ అవి వివిధ దశలలో పురోగతిలో ఉన్నాయని తెలిపారు.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు చైర్మన్  సంజయ్ కుమార్ అగర్వాల్ ప్రసంగిస్తూ గత ఐదేళ్లలో కార్యాలయాల నిర్మాణానికి 54 ప్రతిపాదనలతోపాటు  రూ. 2,200 కోట్లు మంజూరు అయ్యాయని చెప్పారు.  నివాస గృహాల నిర్మాణం లేదా పునరుద్ధరణ కోసం 9 ప్రతిపాదనలపై ప్రభుత్వం  రూ. 640 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు.

 
ఇవి పెద్ద ఏర్పాటు మాత్రమె కాదు, గణనీయమైన పురోగతి అని పేర్కొంటూ సిబిఐసి ఈ  ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి నిశితంగా పర్యవేక్షిస్తోందని చెప్పారు.  జిఎస్‌టి, కస్టమ్స్ ఆదాయాలు పన్నుల ఎగవేతను అరికట్టడానికి, ఆదాయానికి లీకేజీలను అరికట్టడానికి, ముఖ్యంగా నకిలీ ఐటిసిని గుర్తించడం ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంపొందించడంలో సిబిఐసి బృందం పాత్రను  ఆయన అభినందించారు.