ప్రధాని విద్యార్హతలపై ఆరోపణలు చేస్తున్న కేజ్రీ ఆయన ఉన్నత విద్య సర్టిఫికేట్ల కోసం 2016లో సమాచార హక్కు చట్టం కింద కేంద్ర సమాచార కమిషన్ కి దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు పరిశీలించిన సీఐసీ మోదీ ధ్రువపత్రాలు చూపించాలని పీఎంవో కార్యాలయ పీఐవో, గుజరాత్, ఢిల్లీ యూనివర్సిటీల పీఐవోలను 2016లో ఆదేశించింది.
కొన్నాళ్లకు సీఐసీ ఆదేశాలను సవాలు చేస్తూ గుజరాత్ వర్సిటీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో సీఐసీ ఆదేశాలపై అప్పుడు హైకోర్టు స్టే విధించింది. అనంతరం విచారించిన కోర్టు ఆ వివరాలు బయటపెట్టే అవసరం లేదని తీర్పునిచ్చింది. తాజాగా కోర్టు తీర్పు సవాలు చేస్తూ కేజ్రీవాల్ మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారించిన కోర్టు ఆయన పిటిషన్‌ని కొట్టేసింది. ప్రధాని మోదీ 1978లో గుజరాత్ వర్సిటీ నుంచి గ్రాడ్యూయేషన్, 1983లో దిల్లీ వర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు.

More Stories
విదేశాల నుంచి పలువురు కాంగ్రెస్ నేతల ఎక్స్ ఖాతాలు
అయోధ్యలో ధ్వజారోహణంపై పాక్ అవాకులు
కొత్త కార్మిక కోడ్లు ఉద్యోగులు, యజమానులిద్దరికీ ప్రయోజనం