భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ వినియోగదారులకు శుభవార్త. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని సంస్థ ప్రత్యేక రీఛార్జి ప్లాన్ ను తీసుకొచ్చింది. డేటాకు అధిక ప్రాధాన్యతనిస్తూ మూడు రీఛార్జి ప్లాన్స్ ను ప్రవేశపెట్టింది. వీటితో కాలింగ్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ ఉండవు. కేవలం డేటా మాత్రమే వస్తుంది.
దీపావళి పర్వదినం సందర్భంగా బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తున్నరూ. 251 ప్లాన్ చూస్తే ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 70 జీబీ డేటా లభిస్తుంది. వ్యాలిడిటీ 28 రోజులు. ఎలాంటి కాలింగ్, ఎస్‌ఎమ్‌ఎస్ బెనిఫిట్స్ లేవు. బీఎస్‌ఎన్‌ల్ మొబైల్ యాప్ (బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ఫ్ కేర్ యాప్) ద్వారా రీఛార్జ్ చేసుకుంటే 3జీబీ డేటాను అదనంగా పొందొచ్చు.
దీపావళి కానుకగా బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తోన్న మరో రీఛార్జ్ ప్లాన్ రూ. 599. వ్యాలిడిటీ 84 రోజులు. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లతో పాటు రోజుకు 3 జీబీ డేటా ఇస్తారు. బీఎస్‌ఎన్‌ల్ మొబైల్ యాప్ (బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ఫ్ కేర్ యాప్) ద్వారా రీఛార్జ్ చేసుకుంటే 3జీబీ డేటాను అదనంగా పొందొచ్చు.
బీఎస్‌ఎన్‌ఎల్ దీపావళి కానుకగా ప్రవేశపెట్టిన మరో రీఛార్జ్ ప్లాన్ రూ.666. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. 105 రోజులు అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు ఇస్తారు. ఎలాంటి డేటా లభించదు. బీఎస్‌ఎన్‌ల్ మొబైల్ యాప్ (బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ఫ్ కేర్ యాప్) ద్వారా రీఛార్జ్ చేసుకుంటే.. 3జీబీ డేటాను అదనంగా పొందొచ్చు.
More Stories
సైఫ్ అలీఖాన్ కుటుంభం రూ. 15,000 కోట్ల ఆస్తుల జప్తు!
మహా కుంభమేళాతో 12 లక్షల ఉద్యోగాలు
అటల్ పెన్షన్ యోజన రూ.10వేలకు పెంపు?