
పోరాడి సాధించుకున్న తెలంగాణా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బిఆర్‌ఎస్ పార్టీ సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్ర ఖజానాను లూటీ చేస్తుందని స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి గుండె విజయ రామారావు ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన మండలంలోని ఉప్పుగల్లు, కూనూరులో ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా రోడ్ షోలో మాట్లాడుతూ ఎన్నికల హమీలను కెసిఆర్ పూర్తిగా విస్మరించారని ధ్వజమెత్తారు. దళితున్ని ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం వంటి హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. తెలంగాణా ఉద్యమ సమయంలో ఢిల్లీలో బిజెపి, కాంగ్రెస్ నాయకుల కాళ్ళు మొక్కి చెప్రాసి లెక్క ఉంటానని చెప్పిన కెసిఆర్ తెలంగాణా వచ్చాక అక్కడి డిల్లీ నేతలను. ఇక్కడ తెలంగాణా ప్రజలను మోసం చేశారని విమర్శించారు.
కెసిఆర్‌ను మించిన కేటు గాడు మరొకరు ఉండరని చెబుతూ ఇంటికో ఉద్యోగ్యం అని వాళ్ళ ఇంట్లోనే నలుగురికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారని దుయ్యబట్టారు. నీతి, నిజాయితి పరున్ని అని చెప్పుకుంటున్న కడియంకు బంగ్లాలు ఎలా వచ్చాయో చెప్పాలని నిలదీశారు. తాను మంత్రిగా, ఎంపిగా, ఎమ్మెల్యేగా పని చేసినా అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నానని స్ఫష్టం చేశారు. భాజపాను గెలిపిస్తే బిసి ముఖ్యమంత్రి అవుతాడని ప్రకటించారు. దళితురాలికి రాష్ట్రపతి అప్పగించిన ఘనత మోదీ ప్రభుత్వానిదని గుర్తు చేశారు.
టిడిపి పార్టీలో ఉన్నప్పుడు కడియం శ్రీహరి హరీశ్ రావును, కెసిఆర్‌ను కాలి గోటితో సమానమని చెప్పి ఇప్పుడు దొంగలు దొంగలు అంతా ఒక్కటే అన్న చందంగా మారినట్లు ఎద్దేవా చేశారు. కెసిఆర్ మోసపూరిత హామీలను చూసి బిఆర్‌ఎస్ వీడి బిజెపిలో చేరినట్లు తెలిపారు. పేదల కోసం పని చేసే పార్టీ కావాలంటే బిజెపి కమలం పువ్వు గుర్తుకు ఓటేయ్యాలని విజ్ఞప్తి చేశారు.
More Stories
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం
తెలంగాణ రాజకీయాల్లో శూన్యత .. భర్తీకి బిజెపి సిద్ధం
తెలుగు రాష్ట్రాల్లో లోక్ సత్తాతో సహా 25 పార్టీలపై వేటు