
అలిపిరిలోని మండపాన్ని ఏమి చేయాలన్నాటీటీడీ తప్పకుండా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పర్యవేక్షణలోనే చేయాలని, లేదంటే బీజేపీ తప్పకుండా ప్రతిఘటిస్తుందని పురందేశ్వరి స్పష్టం చేశారు. మండపాల మరమ్మతులు, తొలగింపు వంటి పనులు ఖచ్చితంగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ‌్వర్యంలోనే జరగాలని ఆమె డిమాండ్ చేశారు.
టీటీడీ నిధులను తిరుపతి మున్సిపాలిటీకి కేటాయించే విషయంలో ప్రభుత్వం వెనక్కు తగ్గిందని, మరో మార్గంలో టీటీడీ నిధులను పొందేందుకు ప్రయత్నాలు జరుగుతోందని చెబుతూ అదే జరిగితే బీజేపీ ప్రతిఘటిస్తుందని ఆమె హెచ్చరించారు. చెత్త పన్ను, కరెంటు చార్జీల మోత … ఇలా ఎన్నో రకాలుగా వసూలు చేస్తున్నారని చెబుతూ, వాటి ఆదాయంతోనే ప్రభుత్వం మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఆమె హితవు చెప్పారు.
టీటీడీ నిధులతో సనాతన ధర్మ అభ్యున్నతికే ఖర్చు చేయాలని పురందేశ్వరి డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇమామ్‌లకు, ఫాస్టర్లకు గౌరవవేతనం ఇస్తోందని, కానీ ఎస్సీ, ఎస్టీ అర్చకులు ఉన్న ఆలయాల ధూప దీప నైవేద్యాలకు ఇస్తున్న సంభావనలను మాత్రం నిలిపివేసిందని ఆమె ఆరోపించారు. దళిత అర్చకులకు నిలిపివేసిన సంభావనను వెంటనే కొనసాగించాలని పురందేశ్వరి డిమాండ్ చేశారు.
More Stories
సూర్యలంకలో నిర్వహించే బీచ్ ఫెస్టివల్ కు వినూత్న ప్రచారం
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి