98 ఏళ్ళ ప్రస్థానంలో ఆర్ఎస్ఎస్ వికాస క్రమం

రాంపల్లి మల్లిఖార్జునరావు,                                                                                                                                                   ఆర్ఎస్ఎస్ పూర్వరంగం -2

ప్రముఖ సామాజిక విశ్లేషకులు

హిందూ సమాజమే తానుగా, తానే హిందూ సమాజంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) 1925 నుంచి వికసించిన  క్రమం చూద్దాం.

  1. 1925న సంఘ్ ప్రారంభం కాగా, 1926 ఏప్రిల్17నే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ అనే  పేరు  పెట్టారు. ఆ పేరుతో   నాగపూర్ దగ్గర్లో ఉన్న రాంటెక్ లో రామాలయంలో జరిగిన శ్రీ రామనవమి మహోత్సవాల సమయంలో మొదటగా ఓ సేవా కార్యక్రమం చేపట్టారు. స్వయంసేవకుల సేవా, వ్యవహారశైలి ప్రజలందరి   హృదయాలను చూరకొన్నది. దానితో సంఘ్ పేరు  దాంతో సంఘ్  పేరు నలుగురి నీళ్లల్లో పడింది
  2. 1925 సెప్టెంబర్25నవిజయదశమి పండుగ రోజున ప్రారంభమైనా 1926 మే 28న నిత్య శాఖ భగవాధ్వజ ప్రమాణం ప్రార్థనతో   మొదలైంది.
  3. 1926 నుండిరక్షాబంధన్ ఉత్సవం మొదలైంది
  4. 1926  డిసెంబర్19న సంఘ్ వ్యవస్థకుఅంకురార్పణ జరిగింది. ఆరోజు జరిగిన సమావేశాలలో పూజనీయ   డాక్టర్ హెగ్డేవార్ ను సంఘ్ ప్రముఖ్ గా  ఎన్నుకున్నారు.
  5. 1928 వ్యాస పూర్ణిమ రోజునశ్రీ గురుపూజ ఉత్సవం -గురుదక్షిణ కార్యక్రమంజరి గింది. ఆ  కార్యక్రమంలో రూ. 84 దక్షిణ సమర్పించారు.
  6. 1928 మార్చిలో మొట్టమొదటిసారిసంఘప్రతిజ్ఞ కార్యక్రమం  జరిగింది. ఆ కార్యక్రమంలో  99 మంది స్వయం సేవకులు ప్రతిజ్ఞ  తీసుకున్నారు.
  7. 1928 నుండిహేమంతశిబిరాలు ప్రారంభమయ్యాయి.
  8. 1928నవంబర్9, 10 తేదీల్లోనాగపూర్ లో జరిగిన సమావేశాలు సంఘ చరిత్రలో కీలకమైనవి. ఆ సమావేశాల్లోనే  నవంబర్ 10న  డాక్టర్ జీని సర్ సంఘచాలక్  గా ప్రకటించారు.
  9. 1936 అక్టోబర్25 విజయదశమిరోజున హిందూ మహిళా జాగృతి  కొరకు రాష్ట్ర సేవికా సమితిని మౌసీజీ  ప్రారంభించారు. మౌసీజీ అంటే  పినతల్లి  తల్లి అని అర్థం.
  10. 1939 చివరిలో వార్ధా జిల్లా సింధీలోనానాసాహెబ్టాలాటూలే ఇంట్లో పది రోజులపాటు జరిగిన సమావేశాలలో సంఘ్ నియమావళి, ప్రార్థన, ఆజ్ఞలు, కార్య పద్ధతి, ఆచార సంహిత, ప్రతిజ్ఞ, మొదలైన  ఎన్నో విషయాలపై కూలంకుషంగా చర్చించి నిర్ణయించారు.

సంఘ ప్రార్థన హిందూ రాష్ట్ర హృదయానికి ప్రాతినిధ్యం వహించాలని,  ఆజ్ఞలు అన్ని సంస్కృతంలో ఉండాలని నిర్ణయించారు.  ఈ సమావేశాలలో సంఘానికి  హిందూ రాష్ట్ర స్వరూపం ఇవ్వబడింది . 1940 ఏప్రిల్ 23న జరిగిన  సంఘ్ శిక్షా వర్గ నుండి ఇవి అన్ని  అమలులోకి వచ్చాయి.

ఈ సమావేశంలో డాక్టర్ జీ,  గురూజీ, అప్పాజీ జోషి, బాలసాహెబ్  దేవరెస్, తాత్యారావు తెలంగ్, విఠల్ రావు ఫతికి, బాబా సాలోప్కార్ , నానాసాహెబ్ టాలాటూలే, కృష్ణారావు మోహరీల్  పాల్గొన్నారు.

  1. 1925లో సంఘ్ ను ప్రారంభించిన డాక్టర్ జీ  1940లోఈలోకాన్ని విడిచి పెట్టారు. అంటే  వారు సంఘ్ పని 15 సంవత్సరాల పాటు చేశారు, ఆ 15 సంవత్సరాల లో దేశంలో 700 శాఖలు ప్రారంభమయ్యాయి. ఒక లక్ష మంది స్వయంసేవకులు తయారయ్యారు.
  2. 1880లోచంద్రనాథ్బసు ద్వారా హిందుత్వ పదం వాడుకలోకి వచ్చింది. 1892లో వారు హిందుత్వ అనే పుస్తకం రాశారు, ఆ పుస్తకం ప్రస్తుతం  లభ్యం కావడం లేదు.
  3. మొట్టమొదటిసంఘశిక్షావర్గ 1929లో నిర్వహించారు. అందులో  17 మంది శిక్షార్ధులు  పాల్గొన్నారు.
  4. 1935లో డాక్టర్లజీసుశిక్షితులైన కార్యకర్తలను దేశం నలుమూలలకు పంపి సంఘ్ శాఖలను విస్తరింపచేశారు .
  5. 1963 జనవరి26న రిపబ్లిక్ డే కార్యక్రమంలో నాట ప్రధాని జవహర్ లాల్  నెహ్రూ ఆహ్వానం మేరకు మూడువేల మంది  స్వయంసేవకులు  పరేడ్ లో పాల్గొన్నారు. 1962లో చైనాతో  జరిగిన యుద్ధం సమయంలో కేంద్ర ప్రభుత్వానికి ఆర్ఎస్ఎస్ పూర్తిగా సహకరించింది. దానిపై నెహ్రు ”ఉత్సాహం ఉంటే లాఠీ చాలు బాంబులను ఓడించడానికి” అని సంఘ్ కార్యకర్తలను ప్రశంసించారు

 సంఘ కార్య విస్తరణ క్రమం 

 * 1925- 40 మధ్యకాలంలో

స్వాతంత్రం సిద్ధించడానికి 22 సంవత్సరాలు పూర్వం సంఘ్ ను ప్రారంభించారు. 1925 విజయదశమి రోజున సంఘ్ ను ప్రారంభిస్తే 1947 ఆగస్టు 15న  దేశానికీ  స్వాతంత్య్రం  వచ్చింది. స్వాతంత్య్రానికి పూర్వం

దేశంలో ఉన్న అన్ని ప్రావిన్సెస్ లలో  సంఘ్  పని ప్రారంభమైంది. 1940లో జరిగిన శిక్షావర్గలో డాక్టర్ జీ అనారోగ్యంతో ఉన్నప్పటికీ చివరి కార్యక్రమంలో కొద్దిసేపు శిక్షార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ”నేను ఈ రోజున ఒక చిన్న హిందూ రాష్త్ర స్వరూపాన్ని చూస్తున్నాను” అని చెప్పారు.  అంటే దేశంలో ఉండేటువంటి అన్ని ప్రావెన్సుస్  ల నుంచి ఆ వర్గలో పాల్గొనటం విశేషం.

1940 – 47  మధ్య కాలంలో

డాక్టర్జీ పరమపదించిన తదుపరి గురూజీ  సర్ సంఘచాలక్ గా నీయమితులయ్యారు. 1941లో ప్రచారకులు విశేషంగా రావాలని  గురూజీ  పిలుపునిచ్చారు. దానితో దేశంలో అన్ని జిల్లా కేంద్రాలలో  విస్తరణకు విశేష ప్రయత్నాలు జరిగాయి.  గురుజీ మార్గదర్శనంలో దేశవ్యాప్తంగా విశేష విస్తరణ జరిగింది.

ఆ సమయంలో ముస్లింలీగ్ దేశ విభజనకు దూకుడుగా పని చేస్తున్నది.  అక్కడక్కడ మతకలహాలు కూడా  జరిగాయి. అటువంటి పరిస్థితుల్లో  దేశంలో సంఘ శాఖలు విపరీతంగా పెరిగాయి. శాఖలలో సంఖ్య కూడా  వరదలా వచ్చింది.  దేశానికీ స్వాతంత్రం వచ్చింది కానీ దేశం  ముక్కలు అయింది.

ఆ సమయంలో సంఘ్ దేశ విభజనను ఆపలేకపోయినా విభాజిత భూభాగంలో ఉన్నటువంటి హిందువులను సురక్షితంగా  భారతదేశానికి తీసుకొచ్చేందుకు చేసిన కృషి అనితరమైనది. గురూజీ విభజించిన భూభాగాలలో పర్యటన చేసి అక్కడ ఉన్న కార్యకర్తలకు  ఉత్సాహాన్ని ఇచ్చి  చివరి హిందువు భారత్ కు వచ్చేవరకు  కార్యకర్తలు అక్కడే ఉండి  పని చేయాలని చెప్పారు.

1948 జనవరి 30న మహాత్మా గాంధీజీ హత్య  జరిగినప్పుడు  కాంగ్రెస్ ప్రభుత్వం సంఘ్ ను నిషేధించింది.  దానికి  ప్రధాన కారణం ప్రారంభించినప్పటి నుంచి కాంగ్రెస్ సంఘ్ ను  తన ప్రత్యర్థిగానే   చూస్తూ వచ్చింది. ఏ చిన్న అవకాశం దొరికినా సంఘ్ ను అణిచివేయాలని  కాంగ్రెస్ ఆలోచిస్తూ ఉండేది.

సంఘ్ చరిత్ర మలుపు తిప్పిన 1972 థానే సమావేశాలు

1972  నవంబర్ లో ముంబై సమీపంలోని థానేలో దేశంలోని జిల్లా ప్రచారకులు, ఆ  పైవారికి ఐదు రోజులు పాటు సమావేశాలు  జరిగాయి.  ఆ సమావేశంలో భవిష్యత్తు సంఘ విస్తరణ యోజన చేయబడింది.  జిల్లా కేంద్రాలలో పనుల  విషయాలన్నీ   అక్కడ చర్చించారు. దేశానికి సంఘ కార్య ప్రణాళిక కూడా  సిద్ధం చేశారు.

1975 – 77 మధ్య సంఘ్ పై రెండో నిషేధం

1975 – 77 మధ్య సంఘ్ పై రెండో సారి నిషేధం విధించారు.  తన ఎన్నిక చెల్లదని వచ్చిన అలహాబాద్ హైకోర్ట్ తీర్పును దిక్కరించి, తన అధికారాన్ని చలాయించేందుకు అత్యవసర పరిస్థితిని నాటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రకటించారు.

ఆ సమయంలో  దేశంలో జరుగుతున్న నిరసనలను అణిచివేసేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులను  నిర్బంధించి జైలు పాలు చేస్తూ, సంఘ్ ను కూడా నిషేధించారు. సంఘ్ పెద్దఎత్తున ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించింది. ఆ పోరాటంలో సంఘ్ విజయం సాధించి,  ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగింది. 1979- 80 మధ్య కాలంలో    దేశవ్యాప్తంగా జన జాగరణ కార్యక్రమం జరిగింది.

1985- 90 మధ్యకాలంలో

1985లో సంఘ్ ను ప్రారంభించి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా జన జాగరణ కార్యక్రమం జరిగింది. 1989లో     డాక్టర్ జీ శతజయంతి ఉత్సవాలు జరిగాయి . ఆ సందర్భంగా  దేశంలో సామాజిక సమస్యల పరిష్కారానికి విశేష ప్రయత్నాలు ప్రారంభించడానికి దేశవ్యాప్తంగా సేవా నిధి సేకరణ జరిగింది, 1990లో సేవా విభాగాన్ని ప్రారంభించారు.

1996 – 2001 మధ్యకాలంలో

1996లో ధర్మజాగరణ విభాగం  ప్రారంభించారు.  1998లో సంపర్క విభాగం, ప్రచార విభాగంలను ప్రారంభించారు. 2000- 2001  మధ్యలో  సంఘ్ ప్రారంభించి 75 సంవత్సరాల  పూర్తయిన సందర్భంగా  దేశంలోని 4:30 లక్షల గ్రామాలను సర్వే చేశారు.

ఆ సర్వేలో దేశంలో మూడు విషయాలు ఆశ్చర్యకరంగా సంఘ్ కార్యకర్తల ముందుకు వచ్చాయి:

  1.  ఆర్ఎస్ఎస్ మంచిది. `మీరుపనిచేయండి’, `మీరు పనిచేయండి’ అని చెప్పి మన భుజాలు తట్టారు. కానీ  `మీతో పాటు దేశం కోసం మేము పనిచేస్తా’మని  దేశ ప్రజలు చెప్పలేదు. ఇది సంఘ్ కు చాలా ఆశ్చర్యం కలిగించింది.
  2. దేశంలోప్రముఖవ్యక్తులు, రాజకీయ నాయకులను  కలుస్తున్నప్పుడు `హిందుత్వం అంటే మీకే తెలుసు అని అనుకోకండి.  హిందుత్వం అంటే మాకు కూడా తెలుసు. కానీ మేము ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలంటే హిందుత్వం గురించి మాట్లాడితే మేము గెలవలేము కాబట్టి హిందుత్వాన్నీ విమర్శిస్తుంటాము’  అని  చెప్పేవారు.
  3. దేశంమొత్తం  క్రైస్తవీకరణ  ప్రమాదకర స్థాయికి చేరుకొంటోందని అర్ధమైంది. దాని తదుపరి దేశంలో ఈ దిశలో ఆలోచనలు ప్రారంభమయ్యాయి.

2006-07 గురూజీ శతజయంతి ఉత్సవాలు

2006-07లో  గురూజీ శత  జయంతి  ఉత్సవాలు జరిగాయి. ఆ   సందర్భంగా పెద్ద ఎత్తున హిందూ సమ్మేళనాలు, సంఘ్ ద్వారా దేశంలో   మొట్టమొదటిసారి సామాజిక సద్భావన పేరుతో కుల సంఘాల  పెద్దల  సమావేశాలు జిల్లా కేంద్రాలలో నిర్వహించడం జరిగింది. ఇట్లా క్రమంగా   సామాజిక పరివర్తన కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేయటం ప్రారంభమైంది.

2022 – 23లో పనిలో మార్పులు  

ఈ మధ్యకాలంలో సమాజంలో ఉండే పరిస్థితులలోసంఘ్ ప్రగతి  మొదలైన  విషయాలపై చింతన్ సమావేశాలు  జరిగాయి.  ఆ  సమావేశాల నిర్ణయం ప్రకారం  రాబోయే కొద్ది సంవత్సరాల  పాటు  సమాజంలో 12 రకాల పనులు జరగాలని నిర్ణయించారు.

  1. సేవా, 2. సంపర్కవిభాగం, 3. ప్రచార విభాగం, 4. గోరక్షణగో సంవర్ధన,  5. గ్రామ వికాసం, 6. ధర్మజాగరణ, 7. సామాజిక సమరసత,  8. కుటుంబ ప్రభోధన్ 9. పర్యావరణ పరిరక్షణ, 10. సామాజిక సద్భావన, 11. ప్రధాన రహదారులు, 12. సంచారజాతులు.

ఈ పనులను వేగవంతం చేస్తూ సంపూర్ణ సమాజపు సామాజిక  పరివర్తనకుమనం ప్రయత్నించాలని చెప్పారు.  ఆ పనులు 2023 నుంచి క్రమంగా ప్రారంభం అయ్యాయి.

2024- 25 సంఘ్ శతజయంతి సంవత్సరం సందర్భంగా ఉత్సవాలు  నిర్వహించబోతున్నది.  ఈ  సందర్భంగా దేశంలో  సామాజిక పరివర్తన,  ధార్మిక చైతన్యం, ఆర్ధిక స్వావలంబన, పర్యావరణ పరిరక్షణలో జల సంరక్షణ, భూమి సుపోషణ, ప్లాస్టిక్ ముక్త భారత్, గ్రామాల  స్వావలంబన, సార్వభౌమత్వం కాపాడుకోవటం, సామాజిక ఐక్యత   సాధించాలనే లక్ష్యంగా పెట్టుకొని  పని చేయడం జరుగుతోంది.

దశాబ్దాలుగా దేశంలో జరుగుతున్న సైద్ధాంతిక సంఘర్షణలకు  తెరదించి  సంఘ్, సమాజం మమేకం కావాలి. వేల సంవత్సరాల నుండి  హిందూ  సమాజంలో సామాజిక ధార్మిక శక్తే ప్రధానం. రాజకీయాలకు  అతీతంగా సంఘ్ శక్తివంతమవుతూ  క్రమంగా దేశం ఆమూలాగ్ర పరివర్తనకు వేగంగా అడుగులు వేస్తూ ముందుకు పోతున్నది.