
నవంబర్ 1 నుంచి దేశ రాజధాని ఢిల్లీ పరిధిలో డీజిల్ బస్సులు తిరగడంపై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. డీజిల్‌తో నడిచే బస్సులు ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతంలో నవంబర్ 1 నుంచి ప్రయాణించడానికి వీలు లేదని ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ ప్రకటించింది. కేవలం ఎలక్ట్రిక్, సీఎన్‌జీ, బీఎస్ 6 డీజిల్ బస్సులను మాత్రమే అనుమతించనున్నట్లు తెలిపింది.
దీంతోపాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో బాణసంచా వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని ఢిల్లీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దీపావళి సందర్భంగా ఏర్పడే వాయు కాలుష్యాన్ని అరికట్టడమే లక్ష్యంగా ఢిల్లీ, పంజాబ్, హర్యాణా, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల పర్యావరణ శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ శనివారం సమావేశం నిర్వహించారు.
బాణసంచా, చెత్తను కాల్చడాన్ని పూర్తిగా నిషేధించాలని, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే వినియోగించాలని కోరారు. ఫ్యాక్టరీల్లో కాలుష్య ఇంధనాలను ఫైన్డ్ నేచురల్ గ్యాస్‌గా మార్చాలని, ఇటుక బట్టీల పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి జిగ్ జాగ్ టెక్నాలజీ ఉపయోగించాలని.. డీజిల్ జనరేటర్లపై ఆధారపడకుండా ఎన్‌సీఆర్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో విద్యుత్ అందుబాటులో ఉంచాలని ఢిల్లీ మంత్రి కోరారు.
అయితే కేవలం సీఎన్‌జీ, ఎలక్ట్రిక్, బీఎస్ 6 బస్సులు మాత్రమే నడవాలంటే అవి కేవలం 150 వాహనాలు మాత్రమే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక నవంబర్ 1 నుంచి డీజిల్ బస్సులు బంద్ చేస్తే ఇబ్బందులు తలెత్తుతాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
More Stories
పహల్గాం దాడికి ముందు 22 గంటలపాటు ఉగ్రవాదుల ట్రెక్కింగ్!
పహల్గాం ఉగ్రదాడి ఘటనపై ఎన్ఐఎ దర్యాప్తు
కైలాస మానససరోవర్ యాత్రకు వెబ్సైట్ ప్రారంభం