
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం అసైన్డ్ భూములను భారీగా సేకరించింది. ఇందులో భారీగా అక్రమాలు జరిగాయంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ ప్రారంభించింది సీఐడీ. ఈ కేసులో ప్రధానంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రిగా పని చేసిన నారాయమపై అభియోగాలు ఉన్నాయి. సీఐడీ విచారణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారించిన హైకోర్టు మార్చి 19న హైకోర్టు స్టే విధించింది.
మరోవైపు కేసును కొట్టేయాలంటూ చంద్రబాబుతో పాటు నారాయణ కూడా క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. క్వాష్ పిటిషన్‌పై ఇప్పటికే దాదాపు వాదనలు ముగిశాయి. అక్టోబర్ 16న తేదీన తీర్పు రాబోతుంది. తీర్పు వచ్చే క్రమంలో సీఐడీ తాజాగా కొత్తగా రెండు పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి సీఐడీకి మాజీ మంత్రి నారాయణ మరదలు పొంగూరు కృష్ణప్రియ కొన్ని ఆడియో, వీడియో ఆధారాలు అందజేశారని తెలుస్తోంది.
ఇందులో నారాయణ, తదితరులు ఏ విధంగా భూములు కొనుగోలు చేశారు? అనే విషయాలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల మేరకు సమాచారం. అయితే సీఐడీ కొత్తగా పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందనేది ఉత్కంఠగా మారింది.
More Stories
ఏపీలో ఆలయాలకు స్వతంత్ర ప్రతిపత్తి
వైజాగ్ విజ్ఞాన్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
మూడురోజుల పాటు తిరుపతిలో టెంపుల్ ఎక్స్పో