
అక్టోబర్ 10,11 తేదీలలో సిఐడి విచారణకు హాజరైన లోకేష్, బుధవారం విచారణ ముగిసిన తర్వాత నేరుగా ఢిల్లీ వెళ్లి అమిత్ షా ను కలిశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్‌ను 12వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ని కలిసిన లోకేష్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కక్షసాధింపు చర్యలన ఆయన దృష్టి కి తీసుకెళ్లినట్లు తెలిపారు. చంద్రబాబు అరెస్ట్, విచారణ పేరుతో తనని వేధిస్తున్న కక్ష సాధింపు చర్యలను కూడా వివరించారు. తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి ని కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అమిత్ షాకు లోకేష్ వివరించారు.
లోకేష్ చెప్పిన అంశాలను విన్న తర్వాత చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టారు? లోకేష్‌పై ఎన్ని కేసులు పెట్టారని అమిత్ షా ఆరా తీశారు. కక్ష సాధింపుతో జగన్ ప్రభుత్వం పెట్టిన కేసులు, ట్రయల్ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు పరిధిలో వివిధ కేసులకు సంబంధించి జరుగుతున్న విచారణ గురించి అమిత్ షాకి లోకేష్ వివరించినట్టు తెలుస్తోంది.
73 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి ని కేసుల పేరుతో ఇబ్బంది పెట్టడం మంచిది కాదని అమిత్ షా అభిప్రాయపడ్డట్టు లోకేష్ తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారని, రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలను గమనిస్తున్నామని అమిత్ షా పేర్కొన్నారు.
More Stories
జమ్ముకశ్మీర్‌లో 12 మంది పాక్ చొరబాటుదారులు కాల్చివేత
రామ జన్మభూమిలో తొలి `కరసేవక్’ కామేశ్వర చౌపాల్ మృతి
ఐదేళ్లలో తొలిసారి వడ్డీ రేట్లు తగ్గింపు