ఇజ్రాయెల్​లో చిక్కుకొని తిరిగివచ్చిన నటి నుష్రత్

ఇజ్రాయెల్​- హమాస్​ మధ్య జరుగుతున్న ఘర్షణ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్​ నటి నుష్రత్​ భరుచ్చ ఇజ్రాయెల్​లో చిక్కుకుపోయి చివరకు ఆదివారం మధ్యాహ్నం ముంబైకి తిరిగి వచ్చారు. యుద్ధం ప్రారంభం కాగానే ఆమెతో కనెక్షన్​ తెగిపోవడంతో ఆమె బృందం సభ్యులు ఆందోళన చెందారు.

హైఫా ఇంటర్నేషనల్​ ఫిల్మ్​ ఫెస్టివల్​లో పాల్గొనేందుకు కొన్ని రోజుల క్రితమే ఇజ్రాయెల్​కు వెళ్లారు నుష్రత్​. కాగా. శనివారం ఉదయం ఆ దేశంపై గాజా స్ట్రిప్​ నుంచి ఆకస్మిక దాడి ప్రారంభించిన హమాస్​ బృందం గాజా నుంచి సరిహద్దు దాటి, ఇజ్రాయెల్​లోకి ప్రవేశించిన వీధుల్లో విధ్వంసం సృష్టించడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.  

ఈ నేపథ్యంలో అనేక మంది భారతీయులతో పాటు నుష్రత్​ కూడా అక్కడ చిక్కుకుపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. భద్రత కోసం నుస్రత్  ఓ భవనంలోని బేస్‌మెంట్‌లో చాలాసేపు ఉండిపోవాల్సి వచ్చింది.

 “శనివారం మధ్యాహ్నం 12:30 సమయంలో చివరిగా నుష్రత్​తో మాట్లాడాను. ఒక బేస్​మెంట్​లో సురక్షితంగా ఉన్నట్టు తను చెప్పింది. కానీ ఆ తర్వాత, ఆమెతో కనెక్షన్​ తెగిపోయింది. రీ-కనెక్ట్​ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాము. ఆమెను సురక్షితంగా ఇండియాకు తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నాము,” అని బాలీవుడ్​ నటి టీమ్​లోని ఓ వ్యక్తి తెలిపాడు.

ఆమె తిరిగి ఇండియా వెళ్లేందుకు సురక్షితంగా విమానాశ్రయానికి చేరుకుందని ఇజ్రాయెల్ ప్రభుత్వానికి సంబంధించిన వర్గాలు తెలపడంతో ఆమె బృందం ఊపిరి పీల్చుకుంది. ఆమె ముంబై విమానాశ్రయంలో అడుగుపెట్టే సమయంలో ఆందోళనతో ఉండడంతో అక్కడ వేచిఉన్న వారెవ్వరితో మాట్లాడలేకపోయారు. కళ్ళవెంట కన్నీరు కారుతూ కనిపించింది.

భారత పౌరులు రాయబార కార్యాలయం సంప్రదించాలి
 

కాగా, ఇజ్రాయెల్‌లో నివ‌సిస్తున్న భార‌త పౌరులంద‌రూ సుర‌క్షితంగా ఉండాల‌ని, ఎలాంటి సాయం కావాల‌న్నా భార‌త రాయ‌బార కార్యాల‌యాన్ని సంప్ర‌దించాల‌ని విదేశీ వ్య‌వ‌హారాల స‌హాయ మంత్రి వీ. ముర‌ళీధ‌ర‌న్ విజ్ఞ‌ప్తి చేశారు. ఇజ్రాయెల్‌లో భార‌త పౌరులంద‌రికీ భార‌త రాయ‌బార కార్యాల‌యం మార్గ‌ద‌ర్శకాలు జారీ చేసింద‌ని, మ‌న పౌరులంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, ఎలాంటి ప‌రిస్ధితి ఉత్ప‌న్న‌మైనా ఎంబ‌సీతో సంప్ర‌దింపులు జ‌ర‌పాల‌ని కోరామ‌ని తెలిపారు.ఇజ్రాయెల్‌లో ఉన్న భార‌త పౌరులంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, స్ధానిక అధికారులు నిర్ధేశించిన‌ భ‌ద్ర‌తా ప్ర‌మాణాల‌ను అనుస‌రించాల‌ని ఇజ్రాయెల్‌లో భార‌త రాయ‌బార కార్యాల‌యం శ‌నివారం భార‌త పౌరుల‌కు జారీ చేసిన మార్గ‌ద‌ర్శ‌కాల్లో పేర్కొంది. సుర‌క్షిత ప్ర‌దేశాల్లో ఉండాల‌ని, అన‌వ‌స‌రంగా బ‌య‌టతిర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని ఈ గైడ్‌లైన్స్‌లో కోరింది.