భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్

ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారాల ప్రకటనలో భాగంగా భౌతిక శాస్త్రంలో పురస్కారాన్ని రాయల్ స్వీడిష్ అకాడమీఆఫ్ సైన్సెస్ మంగళవారం ప్రకటించింది. ఈ ఏడాది ఈ పురస్కారం ముగ్గురు శాస్త్రవేత్తలను వరించింది.  అమెరికాకు చెందిన పెర్రీ అగోస్తిని, జర్మనీకి చెందిన ఫెర్రెన్స్‌క్రౌజ్, స్వీడన్‌కు చెందిన అన్నె ఎల్‌హ్యూలియర్‌కు ఈ ఏడాది నోబెల్‌ను ప్రకటించారు. 

అణువుల్లో ఎలక్ట్రానిక్ డైనమిక్స్‌ను అధ్యయనం చేసినందుకు, కాంతి తరంగాల లటో సెకండ్ పల్స్‌ను ఉత్పత్తి చేసే పరిశోధనలకుగాను వీరికి ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ వెల్లడించింది. క్వాంట‌మ్ డాట్స్ విశ్లేష‌ణ‌, ఆవిష్క‌ర‌ణ‌లో ఆ ముగ్గురు శాస్త్ర‌వేత్త‌లు కీల‌క పాత్ర పోషించిన‌ట్లు నోబెల్ క‌మిటీ వెల్ల‌డించింది.

 నానో పార్టిక‌ల్స్ డెవ‌లప్మెంట్ లోనూ శాస్త్ర‌వేత్త‌లు ముఖ్య భూమికి నిర్వ‌ర్తించారు. వీరి పరిశోధనలతో అణువులు, పరమాణువుల్లో ఎలక్ట్రాన్స్‌ను అధ్యయనం చేసేందుకు మానవాళికి కొత్త సాధనాలు లభించాయని పేర్కొంది. క్వాంట‌మ్ డాట్స్‌, నానో పార్టిక‌ల్స్‌కు విశిష్ట‌మైన గుణాలు ఉన్నాయ‌ని, టీవీ స్క్రీన్లు, ఎల్ఈడీ బ‌ల్బుల్లో వెలుతురు వ్యాప్తికి ఆ పార్టిక‌ల్సే కార‌ణ‌మ‌ని క‌మిటీ తెలిపింది. 

ఆ పార్టిక‌ల్స్ వ‌ల్ల క‌లిగే ర‌సాయ‌న‌క చ‌ర్య‌లు, వాటి నుంచి ప్ర‌స‌రిస్తున్న వెలుతురు వ‌ల్ల వైద్యులు క‌ణ‌తుల‌కు ఈజీగా శ‌స్త్ర చికిత్స చేస్తున్న‌ట్లు నోబెల్ క‌మిటీ తెలిపింది. క్వాంట‌మ్ డాట్స్ ద్వారా ప‌రిశోధ‌కులు క‌ల‌ర్డ్ లైట్‌ను సృష్టించిన‌ట్లు తెలిపారు. భ‌విష్య‌త్తులో జ‌ర‌గ‌బోయే క్వాంట‌మ్ క‌మ్యూనికేష‌న్ కోసం క్వాంట‌మ్ డాట్స్ కీల‌కం కానున్న‌ట్లు నోబెల్ క‌మిటీ త‌న ప్ర‌క‌ట‌న‌లో చెప్పింది.