ఇస్రోకు రాకెట్ ఇంధనం సరఫరా చేస్తున్న ఆంధ్రా సుగర్స్

 చంద్రయాన్ 3, ఆదిత్య ఎల్ 1ల ప్రయోగం తర్వాత అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచంలోనే అగ్రగామి దేశాలలో ఒకటిగా భారత్ నిలించింది. అందుకు కారణమైన భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నేడు విశ్వవ్యాప్తంగా మన్ననలు అందుకుంటున్నది. రాకెట్ ల ప్రయోగానికి ఈ సంస్థకు రాకెట్ ఇంధనం సమకూర్చుతున్న దేశంలోనే ఏకైక రాకెట్ ఇంధన తయారీ సంస్థ “ది ఆంధ్రా షుగర్స్” కావడం గమనార్హం.
ఇస్రో కు ఇంధనం సమకూర్చిన తణుకు సమీపంలో ఆంధ్రా షుగర్స్ సాధారణ గ్రామీణ ప్రాంతంలో ఏర్పడిన ఒక వ్యవసాయాధార పరిశ్రమ అత్యాధునిక టెక్నాలజీ రంగంలోనూ తన ముద్రను ఆవిష్కరించడం అంత సులభమైన విషయం కాదు. దేశవ్యాప్తంగా డజన్ల సంఖ్యలో చక్కెర కర్మాగారాలు ఉన్నాయి. అయితే వాటిలో దేనికీ లేని ప్రత్యేకతతో ఆంధ్రా షుగర్స్ ఇస్రో పరిశోధనలలో కీలక భూమిక వహిస్తుంది.
రాకెట్ ప్రయోగాలకు అవసరమైన ఇంధనం ఈ ప్యాక్టరీలోనే ఉత్పత్తి అవుతోంది. ఆంధ్ర పారిశ్రామిక పితామహుడిగా పేరుగాంచిన ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్ స్థాపించిన ఈ ఫ్యాక్టరీ నుంచి మూడు రకాల రాకెట్  ఇంధనాలను తయారు చేస్తుండగా, నాలుగో రకం ఇంధనం తయారీకి కూడా ఇస్రో  సహకారంతో  శ్రీకారం చుట్టింది. చెరకు ప్రాసెసింగ్ సమయంలో ఉప ఉత్పత్తి అయిన మొలాసిస్‌ను రెండు రకాల రాకెట్ ప్రొపెల్లెంట్‌లను తయారు చేయడానికి ఉపయోగిస్తుంది.

రాకెట్ ప్రయోగానికి, కౌంట్ డౌన్ ప్రారంభమైన దగ్గర నుంచి ఉపగ్ర హాలను అంతరిక్ష కక్ష్యలో ప్రవేశపెట్టేంత వరకు వివిధ దశల్లో వివిధ రకాల ఇంధనాలను వాడతారు. ఈ ఇంధనాలు ఇప్పటివరకు ఘన,  ద్రవ రూపాల్లో తయారవుతున్నాయి. ఆన్ సిమ్మెట్రికల్ దిమిథైల్ హైడ్రోజన్లు ద్రవ రూపంలో ఉంటుంది. 
మొదటి రెండు ఇంధనాలను తణుకులోని ఆంధ్రా సుగర్స్ శాస్త్రవేత్తలు అభివృద్ధి పరచి వృద్ధి పరచి, ఉత్పత్తి చేస్తుండగా, మూడో రకం ఘన ఇంధనాన్ని ఇస్రో  శాస్త్రవేత్తల సహకారంతో తయారు చేస్తున్నారు. ఇప్పటివరకు రాకెట్  ప్రయోగాలకు మూడు రకాల ఇంధనాలను ఉపయోగిస్తున్నారు. 
 
కాగా రాకెట్ల తయారీలో ఉపయోగించే క్రయోజినిక్ ఇంజన్లకు  ఆసరమయ్యే లిక్విడ్ పెడ్రోజన్ ఇంధనాన్ని తయారు చేసే పనిలో ఇప్పుడు ఆంధ్ర సుగర్స్ నిమగ్నమై ఉంది. వాయు రూపంలో హైడ్రోజన్ ద్రవ రూపంలో సంక్షిప్త  పరచడానికి మైనస్ 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఆవసరం.  ఈ ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తున్న దగ్గర నుంచి, రవాణా, నిల్వ ఉపయోగించేంత వరకు ఈ ఉష్ణోగ్రతలోనే లిక్విడ్ హైడ్రోజన్ ను భద్రపరచాల్సి ఉంటుంది.

1980వ  దశకంలో ఇస్రో తన అవసరాలకు కావాల్సిన ఇంధనం, ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని రష్యా నుంచే దిగుమతి చేసుకునేది. అయితే అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ దేశ అంతరిక్ష ప్రయోగాలకు కావాల్సిన పరిజ్ఞానం, ఇంధనాన్ని దేశీయంగానే అభివృద్ధి పరచాలని నిర్ణయించారు. ఆ బాద్యతలను అప్పటి ఇస్రో ఛైర్మన్  యు.ఎస్. రావుకు అప్పగించారు. ఆయన సూచన మేరకు ఇంధనం తయారీ ప్రాజెక్టును ఆంధ్రా షుగర్స్ కు అప్పగించారు.

1988 జూలై 24వ తేదీన అప్పటి ఉప రాష్ట్రపతి  శంకర్ దయాళ్ శర్మ, ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావులు ఆంధ్రా సుగర్స్ లిమిటెడ్ ల్లో రాకెట్ ఇంధన తయారీ ప్లాంట్లను ప్రారంభించారు.  అప్పటి నుంచి నిరాటంకంగా తనకు అప్పగించిన బాధ్యతలను ఆంధ్ర సుగర్స్ నిర్వహిస్తూ వస్తోంది. ఆమెరికా, రష్యా, ఫ్రాన్స్ వంటి మూడు దేశాలు మాత్రమే రాకెట్ ఇంధనాన్ని తయారు చేస్తుండగా నాలుగో దేశంగా భారత్ అవతరించింది. 

అయితే, ఇంధన తయారీ బాధ్యతను ఆయా దేశాల్లో ప్రభుత్వాలే స్వయంగా నిర్వహిస్తుండగా, భారత్ లో మాత్రమే ప్రైవేట్ రంగంలోని ఓ గ్రామీణ వ్యవసాయ ఆధారిత పరిశ్రమ తయారు చేస్తున్నది.  రక్షణ శాఖల ఆధీనంలో తయారీ ప్లాంట్లు నుంచి పటిషమైన భద్రతా చర్యలను ఈ సందర్భంగా తీసుకొంటున్నారు. ప్రపంచంలో మరి కొన్ని ప్రైవేటు సంస్థలు ఇంధనాన్ని తయారు చేస్తున్నప్పటికీ, అవి కూడా ఆయా ప్రభుత్వాలు సూచించిన భద్రతాపరమైన చర్యలకు లోబడే తయారు చేస్తున్నాయి.

కానీ తణుకు లోని ఆంధ్రా షుగర్స్ లిమిటెడ్ కు మాత్రం అందుకు మినహాయింపు ఇచ్చింది. కేవలం ఫ్యాక్టరీ తీసుకున్న పటిష్టమైన భద్రతా చర్యలను సమీక్షించిన కేంద్ర ప్రభుత్వం, ఇస్రో వర్గాలు ఈ మేరకు సంతృప్తి చెంది తమంతట తాముగా ప్రత్యేక భద్రతను ఇక్కడ నియోగించడం లేదు, రాకెట్స్ ఇంధనం తయారీకీ ఇస్రో ఎప్పటికప్పుడు సాంకేతికపరమైన సలహాలను, సూచనలను అందజేస్తోంది. 

ఆరు నెలలు లేదా ఏడాదికోసారి ఇస్రో, ఆంధ్ర సుగర్స్ వర్గాలు  సంయుక్తంగా సమావేశమై సాంకేతిక శాస్త్రీయ అంశాలపై చర్చలు జరుపుతారు. ఇదే సమయంలో ఇంధనంకు ఏ ధరకు విక్రయించాలన్న దానిపైనా ఒక నిర్ణయానికి వస్తారు. ఇక్కడ తయారయ్యే ఫ్యూయెల్ ను కేవలం ఇస్రో కు మాత్రమే సరఫరా చేస్తారు.