స్కూళ్లలో అబయ డ్రెస్‌ను నిషేధించాలని ఫ్రాన్స్ ప్రభుత్వం నిర్ణయించింది. ముస్లిం అమ్మాయిలు ధరించే ఈ డ్రెస్ దేశ లౌకిక చట్టాలను ఉల్లంఘించేదిగా ఉందని విద్యాశాఖమంత్రి గాబ్రియెల్ అటల్ పేర్కొన్నారు. ఇకపై స్కూళ్లలో అబయను ధరించడం కుదరదని ఆయన స్పష్టం చేశారు.
సెప్టెంబరు 4 నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనున్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో స్కూళ్ల యాజమాన్యాలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఫ్రాన్స్ స్కూళ్లలో ఇస్లామిక్ హెడ్‌స్క్రాఫ్ ధరించడంపై ఎప్పటి నుంచే నిషేధం ఉంది. ఇప్పుడు అబయ డ్రెస్‌ను కూడా నిషేధించనుంది.
ఈ నిర్ణయంపై ప్రతిపక్షాల విమర్శలను ప్రస్తావిస్తూ సెక్యులరిజం అంటే పాఠశాల ద్వారా విముక్తి పొందే స్వేచ్చ అని మంత్రి స్పష్టం చేశారు. అంతేకానీ, తరగతి గదిలోని విద్యార్థులను చూసి వారి మతాన్ని గుర్తించడం కాదని తేల్చి చెప్పారు. కాగా, అబయ డ్రెస్ అనేది శరీరాన్ని కాలి వేళ్ల వరకు కనిపించకుండా ధరించే డ్రెస్.
విద్యార్థులు తమ మతాన్ని ప్రదర్శించేలా ఎలాంటి దుస్తులు ధరించకుండా మార్చి 2004లోనే ప్రభుత్వం నిషేధించింది. ఇందులో శిలువలు, యుదు కిప్పాస్లు, ఇస్లామిక్ హెడ్‌స్కార్ఫ్‌లు ఉన్నాయి. దీంతో ముస్లిం అమ్మాయిలు ఇస్లామిక్ హెడ్‌స్కార్ఫ్‌లకు బదులుగా పొడవైన బ్యాగీ వస్త్రం (అబయ)ను ధరించడం మొదలుపెట్టారు. ఇప్పుడు దానిని కూడా నిషేధించనున్నట్టు ఫ్రాన్స్ ప్రకటించింది.
More Stories
నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారతీయుల అరెస్ట్
భారత్ కు బంగ్లాదేశ్ లో టి20 మహిళా క్రికెట్ సిరీస్
ఇజ్రాయిల్‌తో వాణిజ్యాన్ని నిలిపివేస్తున్న టర్కీ