తన బృందాన్ని ప్రకటించిన పురందేశ్వరి

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తన కార్యవర్గాన్ని ప్రకటించారు. 30 మందితో ఏపీ బీజేపీ కమిటీని నియమించారు. ప్రధాన కార్యదర్శులుగా విశ్వనాథరాజు, బిట్ర శివన్నారాయణ, దయాకర్ రెడ్డి, తపన చౌదరి, ఎన్ మధుకర్ జీలను నియమించారు.  ఇక ఉపాధ్యక్షులుగా పివిఎన్ మాధవ్, విష్ణువర్దన్ రెడ్డి, సూర్యనారాయణరాజు, ఆదినారాయణ రెడ్డి, విష్ణుకుమార్ రాజు, శ్రీదేవి, అయ్యాజీ వేమ, కొత్తపల్లి గీత, వాకాటి నారాయణరెడ్డి, కోడూరు లక్ష్మీనారాయణ చందూ సాంబశివరావులను ప్రకటించారు.

నాగోతు రమేష్ నాయుడు, బూపాటిరాజు శ్రీనివాస్ వర్మ, కె సురేంద్ర మోహన్, సి సావిత్రి, రెడ్డి పావని, కోలా ఆనంద్, మట్టా ప్రసాద్, బాలకృష్ణ యాదవ్, ముని సుబ్రమణ్యం, కందికట్ల రాజేశ్వరిలను కార్యదర్శులుగా నియమించారు.

యువమోర్చా అధ్యక్షునిగా  మిట్ట వంశీ, మహిళా మోర్చా అధ్యక్షురాలిగా బి నిర్మలా కిషోర్, కిసాన్ మోర్చా అధ్యక్షునిగా చ. కుమార్ స్వామి, ఎస్సీ మోర్చా అధ్యక్షునిగా గుడిసె దేవానంద్, ఓబిసి మోర్చా అధ్యక్షునిగా ఉమామహేశ్వరరావు, మైనార్టీ మోర్చా అధ్యక్షుడుగా  షైక్ బాజీ, మీడియా ఇంఛార్జ్ గా పాతూరి నాగభూషణంలను నియమించారు.

అధికార ప్రతినిధులుగా  పూడి తిరుపతిరావు, లంక దినకర్, సుధీష్ రాంబట్ల, ఆర్ డి విల్సన్, సాదినేని యామినీ శర్మ, పెద్దిరెడ్డి రవికిరణ్, డాక్టర్ వినుషా రెడ్డి లను నియమించారు.  సోషల్ మీడియా ఇంచార్జ్ గా  కేశవ కాంత్ వ్యవహరిస్తారు.

ఇలా ఉండగా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.. ఆగస్టు 21న అమరావతికి రానున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీకి సంబంధించిన ఓటర్ల నమోదు ప్రక్రియను ఆయన సమీక్షించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ, ఏపీతోపాటు మహారాష్ట్ర, గోవా, ఒడిశా ఓటర్ల నమోదు ప్రక్రియను సమీక్షించే బాధ్యతను కూడా పార్టీ అధిష్టానం బండి సంజయ్‌కు అప్పగించింది.