గత మూడు సంవత్సరాలుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా గ్రామ పంచాయతీలకు ఇవ్వవలసిన వాటా నిధులు ఇవ్వకపోగా స్థానిక ఆదాయ వనరుల ద్వారా వచ్చే తమ సొంత నిధులను, కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం పంపిన 14,15 వ ఆర్థిక సంఘం నిధులను వేలకోట్ల రూపాయలను దొంగిలించివేసి తన సొంత పథకాలకు, అవసరాలకు దారి మళ్ళించి వాడుకుంటుందని సర్పంచ్ లు చేసిన ఫిర్యాదు పట్ల కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.
సర్పంచుల సమస్యలన్నీ విన్న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ వెంటనే స్పందించి, అతి త్వరలోనే దీనిపై విచారణ చేపట్టి, మీ గ్రామీణ ప్రజలకు, సర్పంచులకు న్యాయం చేకూరే విధంగా చేస్తానని హామీ ఇచ్చారు. ఢిల్లీలోని ఆయన నివాసంలోనే ఎంపీ రఘురామకృష్ణం రాజుఆధ్వర్యంలో ఆం.ప్ర పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్, ఆం.ప్ర. సర్పంచుల సంఘం అధ్యక్షురాలు శ్రీమతి వానపల్లి లక్ష్మీ ముత్యాలరావుల నాయకత్వంలో కలిసి తమ సమస్యలను వివరించారు.
అంతేగాక గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాలను, గృహసారదలను, సచివాలయ కన్వీనర్లను క్రొత్తగా ప్రవేశపెట్టి పంచాయతీల – సర్పంచుల హక్కులు, అధికారాలు, విధులు, బాధ్యతలను హైజాక్ చేసి తమకు పోటీగా సమాంతర వ్యవస్థలను పెట్టారని తెలిపారు. దానితో ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నికలలో ఎన్నుకోబడిన సర్పంచులు ప్రస్తుతం గ్రామాలలో ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిథి పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని, దీనివలన గ్రామాల ప్రజలు కనీసం త్రాగడానికి త్రాగునీరు రోడ్లు, లైట్లు, ట్రైన్స్ లేక పలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తమ 16 డిమాండ్లను పరిష్కరించడానికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. గిర్రాజ్ సింగ్ ను కలిసిన వారిలో ఛాంబర్ ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్, వైసిపి, టిడిపి, బిజెపి, జనసేన, సిపిఐ ఇతర పార్టీలకు చెందిన 100 మంది సర్పంచులు కూడా ఉన్నారు.
More Stories
అండర్-19 ప్రపంచకప్.. సూపర్ సిక్స్లోకి యువ భారత్
అక్రమ వలస వెళ్లిన భారతీయులను తిరిగి రప్పించేందుకు సిద్ధం
ట్రంప్ `పౌరసత్వం’ నిర్ణయంపై అమెరికాలోని 22 రాష్ర్టాల దావా