కశ్మీర్‌లో హిజ్బుల్‌ అగ్రకమాండర్‌ హతం

జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలో నియంత్రణ రేఖ  వెంబడి సోమవారం భద్రతా దళాలు చంపినా దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులలో ఒకరు  హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రసంస్థలో అగ్రకమాండర్‌గా ఉన్న మునేసెర్‌ హుసేన్‌ అని గుర్తించారు. మరొకడు, అతడి అంగరక్షకుడిగా తెలిపారు. 
 
కశ్మీర్‌లో కార్యకలాపాల్ని తిరిగి ప్రారంభించేందుకు ఉగ్రసంస్థ ప్రణాళిక రచించిందని, ఈ క్రమంలోనే విశ్వసనీయ సమాచారం ముష్కరుల చొరబాటును పూంఛ్‌ జిల్లాలో సోమవారం భగ్నం చేశామని అధికారులు తెలిపారు. హుసేన్‌ మృతదేహంతో పాటు భారీగా ముందుగుండు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని, అతడి అంగరక్షకుడు సరిహద్దుకు అటువైపుకు పారిపోయినప్పటికీ నేలకూల్చామని స్పష్టం చేశారు.
 
 ‘‘1996 నుంచీ హిజ్బుల్‌లో హుసేన్‌ క్రియాశీలంగా ఉన్నాడు. ఆ సంస్థకు డివిజనల్‌ కమాండర్‌గా పనిచేశాడు. కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని పెంచేందుకు, ఇక్కడ ఏకాకులైన ఉగ్రవాదుల్ని తిరిగి ఏకం చేసేందుకు కుట్రల్ని రచించేందుకు గాను ఇస్లామాబాద్‌లో ఇటీవల హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉన్నతస్థాయి సమావేశం జరిగింది” అని పూంఛ్‌ సీనియర్‌ సూపరింటెండెంట్‌ వినయ్‌ శర్మ తెలిపారు.
 
ఆ బాధ్యతల్ని హుసేన్‌కు అప్పగించడంతోనే అతడు పూంఛ్‌లోకి ప్రవేశించినట్లు సమాచారం అందడంతో నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ) వద్ద అతడు, తన సహచరుడు భారత్‌లోకి ప్రవేశిస్తుండగా బలగాలు హతమార్చాయి. హుసేన్‌ను అంతం చేసి శత్రుదేశం కుట్రల్ని భగ్నం చేశామని వివరించారు. 
 
రాజౌరీ, పూంఛ్‌ ప్రాంతాల్లో ఒక భయంకరమైన ఉగ్రవాదిగా అతడికి పేరుంది. సీనియర్‌ ఉగ్రవాదుల్ని పంపి ఇక్కడి యువతను ఆకర్షించాలనేది శత్రుదేశం వేసిన స్పష్టమైన ప్రణాళిక. అయితే, ఇక్కడి పౌరుల నుంచి మాకు అద్భుతంగా సహకారం లభిస్తోంది. ఇంకొన్ని రోజుల్లో పూంఛ్‌ను ఉగ్రవాదరహితంగా మారుస్తాం’’ అని వినయ్‌ శర్మ తెలిపారు. స్పష్టం చేశారు.