హైదరాబాద్ లో భారీ వర్షం..అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు

మరోసారి హైదరాబాద్ లో సోమవారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తుంది.  ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో సోమవారం సాయంత్రం నగరవ్యాప్తంగా వాన దంచి కొట్టింది. కుండపోత వానలతో భాగ్యనగరంలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రానున్న మూడ్రోజులు హైదరాబాద్‌తో పాటు పలు నాలుగైదు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

సరిగ్గా ఆఫీస్ ల నుండి బయటకు వచ్చే సమయంలో వర్షం ప్రారంభం కావడంతో నగరవ్యాప్ తంగా ట్రాఫిక్ జాం నడుస్తుంది. భారీ వర్షం నేపథ్యంలో  ఈ నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రొనాల్డ్‌రోస్‌ హెచ్చరించారు .  అనవసర ప్రయాణాలు చేయవద్దని డీఆర్‌ఎఫ్‌ బృందాలు కూడా హెచ్చరికలు జారీ చేశాయి. 

అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యల కోసం 040-21111111, 9000113667 నెంబర్లకు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు. అలాగే ఆఫీస్ లలో ఉన్న వారు ఆఫీస్ ల్లోనే ఉండాలని, వర్షం తగ్గిన తర్వాతే బయటకు రావాలని హితవు చెప్పింది.  సోమవారం నాడు స్కూళ్లు నడిచినప్పటికీ వర్షం పడకముందే విద్యార్థులు క్షేమంగానే ఇళ్లకు చేరుకున్నారు. సాయంత్రం నుంచి మళ్లీ వర్షం పడుతుండటం, రానున్న మూడ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటనతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 

ఈ పరిస్థితుల్లో విద్యార్థులను స్కూళ్లకు పంపడం అస్సలు అయ్యే పనే కాదని వర్షం ఉన్నన్ని రోజులు సెలవులు ప్రకటించాలనే డిమాండ్ పెరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా తెలంగాణ సీఎంవో, విద్యాశాఖ, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీష్ రావులను ట్యాగ్ చేస్తూ సెలవులు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం నుంచే ఇలా సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి

మరోవైపు రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంగా మారింది.  కుండపోత వర్షంతో.. రోడ్లన్ని ఒక్కసారిగా చెరువుల్లా మారిపోయాయి. దీంతో  ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిపోవటంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేక జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మరోవైపు, హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై భారీ వర్షం వల్ల వాహనాల రాకపోకలకు గత రాత్రి తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై చెట్లు నేలకూలాయి. దీంతో, ఆ రూట్లలో రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని చోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

మూసి నది వరద నీటితో ఉరకలేస్తోంది. మూసారాంబాగ్ వంతెన పైకెక్కిన వరదనీరు ఆ మార్గలో రాకపోకలను నిలిపివేసింది. పోలీసులు ట్రాఫిక్‌ను ఇతర మార్గాల్లోకి మళ్లిస్తున్నారు. ప్రధాన మార్గాల్లోని పలు ప్రాంతాల్లో వరదనీరు నాళానీరు కలిసి పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లు కాలువలను తలపిస్తున్నాయి. నగరం పరిధిలో ట్రాఫిక్ జామ్‌తో పలు మార్గాలు గంటల తరబడి వాహనాలనూ రోడ్లపైనే కదలకుండా నిలిపివేస్తోంది.

ఇదిలా ఉంటే ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు హిమాయత్‌సాగర్‌లో 1000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా రెండు గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి దిగువ మూసీలోకి 1340 క్యూసెక్కులు వదులుతున్నారు. రాష్ట్రమంతటా వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలు సృష్టించిన బీభత్సానికి రాష్ట్రంలో జనజీవనం అస్తవ్యస్థంగా మారిపోయింది. 

ఎడతెరిపిలేని వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వాగులు, వంకలు, చిన్నతరహా నదులన్నీ పొంగిపొర్లుతున్నాయి. చిన్నచిన్న వాగులు కూడా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో బ్రిడ్జీలు, కాజ్‌వేల పైగా నీరు ప్రవహిస్తూ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉదృతంగా ప్రవహిస్తున్న వాగుల మూలంగా రొడ్లు తెగిపోవడం, చిన్నచిన్న వాగులు కూడా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో బ్రిడ్జీలు, కాజ్‌వేల పైగా నీరు ప్రవహిస్తూ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఉదృతంగా ప్రవహిస్తున్న వాగుల మూలంగా రొడ్లు తెగిపోవ తో తెలంగాణ, మహారాష్ట్రల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అంతేగాక తెలంగాణ, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్య కూడా రాకపోకలు బంద్ అ య్యాయి. వరదనీటి ప్రవాహానికి రోడ్లు తెగిపోవడమే కాకుండా, విద్యుత్ స్తంభాలు కూడా కూలిపోయాయి. కొన్నిచోట్ల విద్యుత్ వైర్లు తెగి రోడ్లపై పడ్డాయి. మెజారిటీ జిల్లాల్లో చెట్టు కూలిపోయాయి. కూలిపోయిన చెట్లు రోడ్లపైనే పడిపోవడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.