తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తన ఎన్నికల చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టేయాలంటూ మంత్రి వేసిన పిటిషన్‌ను హైకోర్టు బెంచ్ కొట్టేసింది. మంత్రిపై వేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. మరో కొద్ది నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా ఈ పిటీషన్ ఇప్పుడు విచారణకు రావడం రాజకీయ వర్గాలలో ఆసక్తి రేకెక్తిస్తున్నది.
ఎన్నికల అఫిడవిట్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ టాంపర్ చేసి 2018లో పోటీ చేశారని మహబూబూనగర్ నియోజవర్గానికి చెందిన రాఘవేందర్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. శ్రీనివాస్ గౌడ్ ఎన్నికను రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు. దీంతో తన ఎన్నికకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌ను కొట్టేయాలని శ్రీనివాస్ గౌడ్ సైతం హైకోర్టును ఆశ్రయించారు.
రెండు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని పేర్కొంటూ కొట్టేసింది. త్వరలోనే రాఘవేందర్ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు రానుంది. 2018లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా గెలపొందారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో శ్రీనివాస్ గౌడ్..ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
2018 ఎన్నికల టైంలో నామినేషన్ తో పాటు అఫిడవిట్ ను శ్రీనివాస్ గౌడ్ సమర్పించారు. అయితే ఎన్నికల సమయంలో శ్రీనివాస్ గౌడ్ దాఖలు చేసిన అఫిడవిట్ స్థానంలో మరో అఫిడవిట్ అప్లోడ్ చేశారని ఆయన ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో రాఘవేంద్రరాజు కేంద్రఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఎన్నికల సంఘం కూడా విచారణ చేస్తుంది.
More Stories
మున్సిపల్ ఎన్నికల వాయిదాకు రేవంత్ ఎత్తుగడలు
రేవంత్ రెడ్డికి పరిపాలన మీద పట్టు ఉందా?
అరుంధతి నగర్ లో ఇళ్ల కూల్చివేతపై ఈటెల ఆగ్రహం