కిషన్ రెడ్డికి ‘గ్లోబల్ ఇన్‌క్రెడిబుల్ ఐఎన్‌సీ లీడర్‌షిప్ అవార్డు’

కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ  మంత్రి   జి.కిషన్ రెడ్డిని ప్రతిష్టాత్మకమైన ‘గ్లోబల్ ఇన్‌క్రెడిబుల్ ఐఎన్‌సీ లీడర్‌షిప్ అవార్డు’ వరించింది. భారత్-అమెరికాల మధ్య వాణిజ్యం, వ్యాపారం, పీపుల్-టు-పీపుల్ ఎక్స్‌చేంజ్ కార్యక్రమాలు నిర్వహించే.. ‘యూఎస్ ఇండియా ఎస్ ఎం ఇ  కౌన్సిల్’ సంస్థ ఈ అవార్డును కేంద్రమంత్రికి అందజేసింది.

భారతదేశపు ఘనమైన సంస్కృతిని ప్రోత్సహించడంతోపాటు  పర్యాటకాభివృద్ధికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన కృషికి గానూ అమెరికాలోని మేరీలాండ్ స్టేట్ నుంచి వచ్చిన పలువురు ప్రముఖులు ఈ అవార్డును కేంద్రమంత్రికి శనివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) అందజేశారు.

ఈ అవార్డు అందుకున్న సందర్భంగా కిషన్ రెడ్డి ట్విట్టర్‌లో స్పందిస్తూ ‘యూఎస్ ఇండియా ఎస్ ఎం ఇ  కౌన్సిల్’ సంస్థ నుంచి లీడర్ షిప్ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారి నేతృత్వంలో భారతదేశంలో ఘనమైన చరిత్రను, సంస్కృతిని కాపాడుకోవడంతోపాటు పర్యాటక రంగాభివృద్ధికి చేస్తున్న కృషికి ఈ అవార్డు దక్కింది’ అని పేర్కొన్నారు.