రాకెట్‌ను పరీక్షిస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో ప్రాణనష్టం ఏమైనా జరిగిందా అనే విషయంలో ఇప్పటివరకు సమాచారం లేదని జపాన్ ఏరోస్పేస్ ఏజెన్సీ అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్టు చెప్పారు. గత ఏడాది ప్రయోగించినప్పుడు విఫలమైన ఎప్సిలాన్-6 రాకెట్‌ను అభివృద్ధి చేసి ‘ది ఎప్సిలాన్-ఎస్’ పేరిట జపాన్ సిద్ధం చేసింది. ఇప్పుడు ఆ రాకెట్ పరీక్షల దశలో పేలిపోయింది. 2022 అక్టోబర్‌లో ఘన ఇంధనం ఆధారంగా పనిచేసే ఎప్సిలాన్ రాకెట్‌ను జపాన్ ప్రయోగించింది.
అప్పట్లో ఆ ప్రయోగం విఫలమైంది. తాజా మార్పులతో పరీక్షించగా ప్రయోగం మొదలైన 50 సెకన్లలోనే రాకెట్ పేలిపోయింది. పేలుడు అనంతరం ఉత్తర ఆకితా ప్రాంతంలోని ఈ పరీక్షా కేంద్రం పరిసరాల్లో భారీ ఎత్తున మంటలు, పొగలు వ్యాపించాయి. ఘటనకు సంబంధించిన చిత్రాలను జపాన్ జాతీయ మీడియా ప్రసారం చేసింది.

More Stories
ఇరాన్లో భారతీయులు వెంటనే ఆ దేశాన్ని విడిచి రావాలి
ఉగ్రవాదాన్ని అరికట్టడంలో కెనడా 40 ఏళ్లుగా విఫలం
ఇరాన్ నిరసనలతో 2 వేల మందికి పైగా మృతి